ఈ ఫొటోలోని బుజ్జాయిలు ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోస్‌.. మాస్‌ ఫాలోయింగ్‌కు మారు పేరు.. ఎవరో గుర్తుపట్టారా మరి?

సినిమా సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు తమ బాల్యంలోని తీపి గుర్తులను ఇలా త్రో బ్యాక్‌ ఫొటోలతోనే షేర్‌ చేసుకుంటారు. నెటిజన్లు కూడా వీటిపై తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఫేవరెట్ హీరో/ హీరోయిన్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి తాపత్రయపడుతుంటారు. ఈక్రమంలో టాలీవుడ్‌కు చెందిన టాప్‌స్టార్స్‌ చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ ఫొటోలోని బుజ్జాయిలు ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోస్‌.. మాస్‌ ఫాలోయింగ్‌కు మారు పేరు.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Tollywood
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2023 | 7:32 AM

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నటిస్తోంది. ముఖ్యంగా సినిమా తారల చిన్ననాటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంటాయి. సినిమా సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు తమ బాల్యంలోని తీపి గుర్తులను ఇలా త్రో బ్యాక్‌ ఫొటోలతోనే షేర్‌ చేసుకుంటారు. నెటిజన్లు కూడా వీటిపై తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఫేవరెట్ హీరో/ హీరోయిన్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి తాపత్రయపడుతుంటారు. ఈక్రమంలో టాలీవుడ్‌కు చెందిన టాప్‌స్టార్స్‌ చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న బుజ్జాయిలు ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోలు. సినిమా ఇండస్ట్రీలో బాగా పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చినా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ఇక అభిమాన గణం విషయానికొస్తే.. మాస్‌ ఫాలోయింగ్‌కు ఈ స్టార్స్‌ కేరాఫ్ అడ్రస్‌. మరి ఒకరిని మించి ఒకరు వరుస హిట్లు కొడుతూ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్ ఈ హీరోలు ఎవరో గుర్తుపట్టారా? పై ఫొటోలో క్యూట్‌లుక్స్‌తో కనిపిస్తున్నది మరెవరో కాదు పాన్‌ ఇండియా హీరోలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

ఆర్‌ఆర్‌ఆర్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌స్టార్‌గా ఎదగ్గా, పుష్ప సినిమాతో నేషనల్‌ లెవెల్‌లో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు బన్నీ. శనివారం (ఏప్రిల్‌ 8) అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని చిన్ననాటి ఫొటోలు సామజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అందులో భాగంగా పై ఫొటో ఫ్యాన్స్‌ను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మొదటి ఫొటోలో కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ తో కనిపించిన వీరు రెండో ఫొటోలో మాత్రం స్టైలిష్‌ దుస్తులతో హీరోల్లా పోజులిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..