
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో చాలా మంది గతంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. చిన్నతనంలోనే కెమెరాను ఫేస్ చేసిన వారే. అయితే చదువు, ఇతర కారణాలతో మధ్యలో ఇండస్ట్రీని వదిలేశారు. మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. తమ అందం, అభినయంతో అదరగొడుతున్నారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ అందాల తార ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 211లో స్వప్న సంచారి అనే ఓ మలయాళం సినిమాలో నటించింది. అందులో తమిళం నటుడు జయరామ్ కూతురిగా యాక్ట్ చేసింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. పై ఫొటోలో ఉన్నది ఆ సినిమా స్టిల్ నే. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా?
ఛైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక సినిమాలో నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత చదువులపై దృష్టి సారించింది. ఫలితంగా సినిమాలకు దూరమైంది. సరిగ్గా ఐదేళ్లకు మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో అయితే పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రవితేజ, గోపీచంద్, తమిళంలో కార్తీ, విశాల్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మార్కులు తెచ్చుకుంది. కానీ ఎందుకోగానీ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈమె నటించిన సినిమాల్లో చాలా వరకు సెకెండ్ హీరోయిన్ రోల్సే. ఆమె మరెవరో కాదు అను ఇమ్మాన్యుయేల్.
2016లో నాని నటించిన “మజ్ను” చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాలోనే తన క్యూట్ నెస్ తో కుర్రకారుకు ఫెవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, తుప్పరివాలన్ (డిటెక్టివ్), ఆక్సిజన్, అజ్జాతవాసి, నా పేరు సూర్య, అల్లుడు అదుర్స్, శైలజారెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర, జపాన్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే వీటిలో దాదాపు సెకెండ్ హీరోయిన్ గానే యాక్ట్ చేసిందీ అందాల తార. అందుకే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి