Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. 3 కోట్ల సినిమాతో వంద కోట్లు రాబట్టిన ముద్దుగుమ్మ

ఆ మధ్యన రిలీజైన ఒక సినిమా యువతను తెగ ఆకట్టుకుంది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించింది కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. 3 కోట్ల సినిమాతో వంద కోట్లు రాబట్టిన ముద్దుగుమ్మ
Tollywood Actress

Updated on: Oct 20, 2025 | 2:24 PM

పై ఫొటోలోని సర్కిల్ లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే గతేడాది ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ఈ బ్యూటీకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చి పెట్టింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యువతను తెగ ఆకట్టుకుంది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గారూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ సెన్సేషనల్ హిట్ సినిమాలోనే తన ఎక్స్ ప్రెషన్స్ తో యువత హృదయాలు కొల్లగొట్టిందీ అందాల తార. తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజిగా ఉంటోందీ అందాల తార. అలాగే దళపతి విజయ్, సూర్య, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్ లో పుట్టి పెరిగిందీ అందాల తార. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండడంతో కొచ్చిలోని ఓ కళాశాలలో సైకాలజీలో బీఎస్సీ చదివింది. అయితే సినిమాలపై మక్కువ ఉండడంతో డిగ్రీ మధ్యలోనే వదిలేసింది. ఆ తర్వాత మలయాళంలో చాలా సినిమాలు చేసింది. 2017 సినిమాలు చేసినఈ ముద్దుగుమ్మ బాగా హైలెట్ అయ్యింది మాత్రం2024లోనే అది కూడా ప్రేమలు అనే ఒకే ఒక్క సినిమాతో. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఆ మూవీ హీరోయిన్ మమితా బైజు. పక్కన ఉన్నది ఆమె సోదరుడు మితున్.

ఇవి కూడా చదవండి

డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ తో మమితా..

ప్రేమలు తర్వాత ఈ మూవీకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్ అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార. అలాగే సూర్య-వెంకీ అట్లూరి మూవీలోనూ, దళపతి విజయ్ జన నాయగన్ లోనూ, ధనుష్ డీ54 మూవీస లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటోందీ అందాల తార.

సూర్య సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.