Tollywood: ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్‌‌ను గుర్తుపట్టగలరా.? ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్.!

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఈ అమ్మాయిల గ్యాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది. ఆమెవరో గుర్తుపట్టగలరా.? కేవలం ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో..

Tollywood: ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్‌‌ను గుర్తుపట్టగలరా.? ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్.!
Tollywood

Updated on: Jun 24, 2023 | 5:15 PM

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఈ అమ్మాయిల గ్యాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది. ఆమెవరో గుర్తుపట్టగలరా.? కేవలం ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌కు దగ్గరైంది. అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది ఈ భామ. ఇంతకీ ఆమెవరో మీకు అర్ధమైంది.! లేదా మమ్మల్ని క్లూ ఇమ్మంటారా.. సరే ఆమె సినీ ఇండస్ట్రీలోకి బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టింది. ఇటీవల తెలుగులో చేసిన ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లోనే తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చుకుంది.

ఎస్.! ఆమె మరెవరో కాదు.. మృణాల్ ఠాకూర్. మోడలింగ్ అనంతరం బుల్లితెరపై మెరిసిన ఈ బ్యూటీ.. పలు హిందీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వచ్చిన సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ‘సూపర్ 30’, ‘ధమాకా’, ‘జెర్సీ’ సినిమాలతో తన నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇటీవల వచ్చిన ‘సీతారామం’ సినిమా ద్వారా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో తన ఫ్యాన్ బేస్ అమాంతం పెంచేసింది.

అటు సీతగా వెండితెరపై ఆకట్టుకున్న మృణాల్.. ఇటు హాట్ పోజులు ఇస్తూ సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్ళకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. కాగా, ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు, హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. అలాగే ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌తో మరి కొద్దిరోజులు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.