AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బిగ్‏బాస్ విన్నర్ ఎవరో గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకూమారుడు..

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమ చైల్డ్ హుడ్, స్కూల్ డేస్ గుర్తుచేసుకుంటూ సెలబ్రెటీస్ కూడా తమ బాల్యం తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో కలిసి పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో కమ్ బిగ్ బాస్ విన్నర్ కూడా తన చైల్డ్ హుడ్ ఫోటోస్ షేర్ చేశారు.

Tollywood: ఈ బిగ్‏బాస్ విన్నర్ ఎవరో గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకూమారుడు..
Actor
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2024 | 5:32 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ క్రేజీ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. తెలుగులో అతి తక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు అమ్మాయిల ఫేవరేట్ హీరో కూడా. ఒకట్రెండు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ రెడ్ టీషర్ట్ కుర్రాడు ఎవరో గుర్తుపట్టరా.. ? అతడే హీరో అభిజిత్. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్. మొదట్లో ఎలాంటి హైప్ లేకుండానే హౌస్ లోకి అడుగుపెట్టిన అభిజిత్.. ఆ తర్వాత ఆట తీరు, బుద్దిబలంతో టాస్కులతో పాటు ఇటు అమ్మాయిల మనసులు గెలిచి మిస్టర్ పర్ఫెక్ట్ గా బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ షో తర్వాత అభిజిత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అవుతాడని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ తో ప్రపంచాన్ని చూట్టేస్తున్నాడు.

చిన్నప్పుడు స్కూల్లో తన క్లాస్ మేట్స్ అందరితో కలిసి దిగిన ఫోటోను అభిజిత్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం అభిజిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటున్నాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. బైక్ రైడింగ్ నుంచి ఫ్యామిలీ విషయాల వరకు నెట్టింట షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..చాలా కాలం తర్వాత అభిజిత్ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చాడు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై సుప్రియ నిర్మించిన ఈ సిరీస్ కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సిరీస్ తర్వాత అభిజీత్ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు.

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్