OTT Horror Movie: వణుకుపుట్టించే ట్విస్టులు.. భయాంకరమైన హారర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా చూస్తే అంతే సంగతులు..
హారర్ సినీ ప్రియుల కోసం ఇటీవల కాలంలో థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. దీపావళి పండగ రోజు కూడా హారర్ థ్రిల్లింగ్ మూవీ చూడాలనుకుంటే ఈసినిమా మీకోసమే. కానీ ఒంటరిగా చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే. ఈ భయానక మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హారర్ సినిమాలు చూసేవారికి నిజంగా ఇది శుభవార్తే. డోన్డ్ కమ్ హోమ్ అనే వెబ్ సిరీస్ దీపావళి సందర్భంగా ఈరోజు (అక్టోబర్ 31) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తల్లి, కూతురుకు సంబంధించిన కథతో ఈ సిరీస్ సాగుతుంది. డోన్డ్ కమ్ హోమ్ అనేది హారర్ మిస్టరీ వె్బ సిరీస్. ఇది ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కొన్నాళ్ల క్రితం విడుదలైన ట్రైలర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. థాయ్ లాండ్ లోని ఓ అడవిలో ఉన్న ఓ మ్యాన్షన్ లో జరిగే హారర్ సిరీస్ ఇది. భారతదేశంలో ఈ సిరీస్ కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. బ్యాంకాక్‌కు కొద్ది దూరంలో అడవి మధ్యలో ఉన్న ఓ ఇంట్లో వాలీ అనే మహిళ తన కుమార్తెతో కలిసి నివసిస్తోంది. అయితే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు.
అయితే ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆ తల్లీ కూతుళ్లకు వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఒకరోజు హఠాత్తుగా కూతురు మిస్ అవుతుంది. ఆ తల్లి ఎంత వెతికినా కనిపించదు. దీంతో చిన్నారి గురించి పోలీసులు కూడా ఆరా తీస్తుంటారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటాయి.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
చివరకు వారు ఆ తల్లిపైనే అనుమానం వ్యక్తం చేస్తారు. ఆమె ఎవరు.. ఆమె ఆ ఇంటికి ఎందుకు వచ్చింది ? ఆ చివరకు పాప దొరుకుతుందా అనేది కథ. ఇది మొదటి సీజన్ మాత్రమే. మరో సీజన్ వచ్చే అవకాశం ఉంది. డోంట్ కమ్ హోమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. డోంట్ కమ్ హోమ్‌లో వొరానుచ్ భీరోంభాక్డి, సిండి సిరిన్యా బిషప్, పిచాపా ఫాంటుమ్చిందా నటించారు.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.