Chandramukhi 2: చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా జోతికాను మరిపిస్తుందా..?

తాజాగా రిలీజ్ అయిన కంగన రనౌత్ లుక్ ఎలా ఉంది..? చంద్రముఖిలో జ్యోతికతో పోలికలు కంగనకు ప్లస్సా మైనస్సా..?  చంద్రముఖి అనగానే మనకు తెలియకుండానే జ్యోతిక రూపం కళ్ల ముందుకు వచ్చేస్తుంది. ఈ సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేసినా.. జ్యోతిక పర్ఫార్మెన్స్ మాత్రం అలా గుర్తుండిపోయింది. 90ల్లో శోభన.. 2003లో సౌందర్య కూడా చంద్రముఖిగా నటించినా.. ఈ జనరేషన్‌కు మాత్రం చంద్రముఖి అంటే జ్యోతికే.

Chandramukhi 2: చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా జోతికాను మరిపిస్తుందా..?
Kangana

Edited By: Rajeev Rayala

Updated on: Aug 07, 2023 | 10:02 AM

చంద్రముఖి 2 అదే రేంజ్‌లో మ్యాజిక్ చేస్తుందా..? 18 ఏళ్ళ నాటి రజినీకాంత్ సినిమాను లారెన్స్ చంద్రముఖి మరిపించగలదా..? సీక్వెల్ అనే అడ్వాంటేజ్ ఉన్నా.. ఆ రేంజ్ కథ, కథనాలు ఇందులోనూ ఉంటాయా..? లారెన్స్ మార్కెట్ చంద్రముఖి 2కి ఎంత వరకు హెల్ప్ కానుంది..? తాజాగా రిలీజ్ అయిన కంగన రనౌత్ లుక్ ఎలా ఉంది..? చంద్రముఖిలో జ్యోతికతో పోలికలు కంగనకు ప్లస్సా మైనస్సా..?  చంద్రముఖి అనగానే మనకు తెలియకుండానే జ్యోతిక రూపం కళ్ల ముందుకు వచ్చేస్తుంది. ఈ సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేసినా.. జ్యోతిక పర్ఫార్మెన్స్ మాత్రం అలా గుర్తుండిపోయింది. 90ల్లో శోభన.. 2003లో సౌందర్య కూడా చంద్రముఖిగా నటించినా.. ఈ జనరేషన్‌కు మాత్రం చంద్రముఖి అంటే జ్యోతికే. ఆ తర్వాత భూల్ భులయ్యాలో విద్యా బాలన్ అదే పాత్ర చేసినా.. జ్యోతికను మరిపించలేదు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నయనతార కూడా కీలక పాత్రలో నటించింది. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ చంద్రముఖి. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లో భారీ విజయం సాధించింది. చంద్రముఖి వచ్చి 18 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ అలాగే ఉండిపోయింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా నాగవల్లి చేసారు పి వాసు. కాకపోతే అందులో రజినీ కాకుండా వెంకటేష్ నటించారు. ఇప్పుడు చంద్రముఖి 2 పేరుతో మరో సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ రోల్ చేస్తున్న కంగన రనౌత్ లుక్ బయటికి వచ్చింది. ఈ మధ్యే లారెన్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

చంద్రముఖి 2లో కంగనా అందంగా ఉన్నారు కానీ.. భయపెట్టేలా మాత్రం లేదు. సినిమాలోనే ఆ పర్ఫార్మెన్స్ అంతా దాచేసారేమో కానీ.. పోస్టర్ మాత్రం సాదాసీదాగానే ఉంది. ఒక్కటైతే నిజం.. ఈ సినిమాపై అంచనాలతో పాటు కంపారిజన్ కూడా బాగానే ఉంటుంది. జ్యోతికను మరిపిస్తే కానీ కంగన రనౌత్ చంద్రముఖిగా సక్సెస్ అవ్వనట్లే. హార్రర్‌ కామెడీగా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. సెప్టెంబర్ 15న పాన్ ఇండియన్ సినిమాగా ఇది విడుదల కానుంది.