Uorfi Javed: హీరోయిన్ లగేజ్‌తో ఉడాయించిన క్యాబ్ డ్రైవర్.. లబోదిబోమన్న బ్యూటీ

అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

Uorfi Javed: హీరోయిన్ లగేజ్‌తో ఉడాయించిన క్యాబ్ డ్రైవర్.. లబోదిబోమన్న బ్యూటీ
Urfi Javed

Updated on: Feb 22, 2023 | 3:31 PM

కొన్ని సార్లు సినిమా తరాలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ నటి క్యాబ్ డ్రైవర్ చేతిలో మోసపోయింది. అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. విచిత్రమైన డ్రసింగ్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ భామ. బాలీవుడ్ లో బిగ్ బాస్ వల్ల ఈ చిన్నదానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక చిత్ర విచిత్రంగా డ్రస్సులేసుకొని జనల మతులు పోగొట్టింది ఈ ఉర్ఫీ. తాజాగా తాను ఒక క్యాబ్ డ్రైవర్  చేసిన పని గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఉర్ఫీ ఢిల్లీ తన ఇంటి దగ్గర నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ఒక క్యాబ్ ను బుక్ చేసుకుందట.. అయితే మధ్యలో ఆకలిగా అనిపించడంతో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి ఆమె లోపలి వెళ్లిందట.. అంతే ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె లగేజితో అక్కడి నుంచి చెక్కేశాడట..

ఇదంతా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది ఉర్ఫీ జాదవ్. దీని పై సదరు క్యాబ్ బుకింగ్ యాప్ లో కంప్లెయింట్ కూడా ఇచ్చిందట కానీ వారు పట్టించుకోలేదని చెప్తోంది ఈ బ్యూటీ. ఇక ఇటీవల ఉర్ఫీ డ్రసింగ్ విషయంలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. నెటిజన్లు ఒక రేంజ్ లో ఈ అమ్మడిని ఆడుకున్నారు.