Mem Famous: మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. రూ.99కే ‘మేమే ఫేమస్‌’ టికెట్స్‌.. ఏయే థియేటర్లలో అంటే?

|

May 27, 2023 | 5:25 PM

'మేమ్‌ ఫేమస్‌'.. ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందే బాగా పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న సినిమా. విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్‌, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్‌ హీరోలందరూ ప్రమోట్‌ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు సుమంత్‌ ప్రభాస్‌

Mem Famous: మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. రూ.99కే  మేమే ఫేమస్‌ టికెట్స్‌..  ఏయే థియేటర్లలో అంటే?
Mem Famous Movie
Follow us on

‘మేమ్‌ ఫేమస్‌’.. ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందే బాగా పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న సినిమా. విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్‌, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్‌ హీరోలందరూ ప్రమోట్‌ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు సుమంత్‌ ప్రభాస్‌. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలో నటించారు. ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లహరి ఫిల్మ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరో సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాయి. శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్‌, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మరింత స్పీడ్‌ పెంచారు మూవీ మేకర్స్‌. తాజాగా మేమ్‌ ఫేసమ్‌ టికెట్ల ధరలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచుతారు. అయితే మేమ్ ఫేమస్ మూవీ టికెట్లు మాత్రం కేవలం రూ.99కే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మేమ్ ఫేమస్ సినిమాను కేవలం రూ.99కే చూడొచ్చు. దీనివల్ల తొలి రోజే థియేటర్లు పూర్తిస్థాయిలో నిండుతాయని, తద్వారా తమ సినిమా జనాల్లోకి మరింత వేగంగా వెళుతుందని మూవీ యూనిట్‌ భావిస్తోంది.

యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మేమ్‌ ఫేమస్ సినిమా పాటలు, టీజర్లు, ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ థియెట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్‌ చూస్తుంటే ఫన్ అండ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సరదా సంభాషణలు, ఫేమస్ కావడానికి పడే పాట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి తక్కువ ఖర్చుతో సినిమా చూడాలనకుంటే మేమ్‌ ఫేమస్‌ మంచి ఛాయిస్‌.

 

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..