Avantika Vandanapu: హాలీవుడ్‏లో తెలుగమ్మాయి జోరు.. వరుస ఆఫర్లతో బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ బిజీ..

ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో బాలనటిగా కనిపించింది.. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పైన ఫోటోను చూశారా ?.. ఆ అమ్మాయిని గుర్తుపట్టరా ?.. తనే టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు. బాలనటిగా పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. బుల్లితెరపై కొన్ని యాడ్స్ చేసి ఫేమస్ అయ్యింది.

Avantika Vandanapu: హాలీవుడ్‏లో తెలుగమ్మాయి జోరు.. వరుస ఆఫర్లతో బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ బిజీ..
Avantika Vandanapu
Follow us

|

Updated on: Jan 14, 2024 | 5:26 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పేరు తెగ మారుమోగిపోతుంది. ఆమె చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో బాలనటిగా కనిపించింది.. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పైన ఫోటోను చూశారా ?.. ఆ అమ్మాయిని గుర్తుపట్టరా ?.. తనే టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు. బాలనటిగా పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. బుల్లితెరపై కొన్ని యాడ్స్ చేసి ఫేమస్ అయ్యింది. “అమ్మను మర్చిపోలేం.. అంబికాను మర్చిపోలేం” అనే డైలాగ్ చెప్పగానే ఈ చిన్నారి గుర్తుకువస్తుంది. అప్పట్లో ఈ యాడ్ బాగానే వైరలయ్యింది. అందులో నటించిన చిన్నారి అవంతిక వందనపు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా నటించింది. కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి సహా మరిన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

అవంతిక వందనపు.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తోన్న తెలుగమ్మాయి. మీన్ గర్ల్స్ చిత్రంలో కరేన్ శెట్టి అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రంతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు హాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తోందట. అక్కడ మంచి విజయం సాధించడంతోపాటు.. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన అవంతిక పేరు కూడా ఇప్పుడు మారుమోగిపోతుంది. ఆమె గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఆమె ఇన్ స్టా ఐడీని తెగ షేర్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by avantika (@avantika)

తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక.. 2005లో కాలిఫోర్నియాలో జన్మించారు. అక్కడే చదువుతోపాటు యాక్టింగ్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అవంతిక.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో డైరీ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్, స్పిన్, సీనియర్ ఇయర్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మీన్ గర్ల్స్ సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. అలాగే అక్కడే మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by avantika (@avantika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.