Brahmanandam: మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫోటో ఇవ్వని బ్రహ్మానందం.. అసలు విషయం చెప్పిన బ్రహ్మీ..

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా వేలాది సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బ్రహ్మీ వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించారు బ్రహ్మానందం.

Brahmanandam: మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫోటో ఇవ్వని బ్రహ్మానందం.. అసలు విషయం చెప్పిన బ్రహ్మీ..
Brahmanandam

Updated on: Nov 23, 2025 | 7:45 PM

హాస్యబ్రహ్మా, కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే బ్రహ్మానందం.. ఇప్పుడు సినిమాలు తగ్గించారు. అయితే ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటో అడగ్గా.. ఇప్పుడు కాదంటూ బ్రహ్మానందం ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మాజీ మంత్రికి ఫోటో ఇవ్వకుండా బ్రహ్మానందం వెళ్లిపోయారంటూ ఆ వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగ ఆ వివాదంపై స్పందించారు బ్రహ్మానందం. తమ మధ్య ఉన్న చనువుతోనే అలా వ్యవహరించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో షేర్ చేస్తూ అసలు విషయం చెప్పారు.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

బ్రహ్మానందం మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం.. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను.. నేను మోహన్ బాబుగారి వేడుకకు వెళ్లే హడావిడిలో ఉన్నాను.. అప్పుడే దయన్న ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటిగా కాసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంతలో ఫోటో తీసుకుందాం అని పిలిచారు. నేను ఇప్పుడు వద్దంటూ లోపలికి వెళ్లిపోయాను. ఆ సన్నివేశాన్ని కొందరు మిత్రులు అపార్థం చేసుకున్నారు. దయన్నతో నాకు 30 ఏళ్ల బంధం ఉంది. మేమిద్దరం మంచి మిత్రలం. చాలా ప్రేమగా చూసుకుంటారు.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాము. ఆయనతో ఉన్న చనువుతోనే ఉండండి అంటూ ముందుకు వెళ్లిపోయాను. కావాలని నేను తోసేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత నేను, ఆయన మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూడగానే ఇద్దరం నవ్వుకున్నాం. అన్నా తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన నాతో మాట్లాడారు. ఇందులో అపార్థాలకు తావులేదని స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి” అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

 

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..