AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya : నాగచైతన్య ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆ ఒక్కదానికి దూరంగా ఉంటారట..

అక్కినేని యువసామ్రాట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈరోజు (నవంబర్ 23న) చైతూ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు చైతూ సినిమాలు, ఫ్యాషన్, ఫిట్నెస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Naga Chaitanya : నాగచైతన్య ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆ ఒక్కదానికి దూరంగా ఉంటారట..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2025 | 8:56 PM

Share

అక్కినేని నాగచైతన్య.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరో. జోష్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చైతూ.. ఆ తర్వాత ఏమాయ చేసావే మూవీతో హిట్ అందుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు చైతూ. ఇటీవలే లవ్ స్టోరీ, తండేల్ చిత్రాలతో హిట్స్ అందుకున్న చైతూ.. ఇప్పుడు వృషకర్మ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కినేని ఫ్యామిలీ డైట్, ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. 65 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ జనాలకు షాకిస్తున్నారు నాగార్జున. మరోవైపు చైతన్య సైతం 39 ఏళ్ల వయసులోనూ మరింత ఫిట్ గా కనిపిస్తుంటారు. ఇంతకీ చైతూ తన డైట్, ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

చైతూ ఫిట్నెస్ విషయానికి వస్తే.. తాను చక్కెరకు చాలా దూరంగా ఉంటారట. చక్కెర అనేది శరీరానికి అతిపెద్ద టాక్సిన్ అని గతంలో ఓ పాడ్ కాస్ట్ లో చెప్పారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని అన్నారు. తాను చక్కెర, షుగర్ ఉండే పదార్థాలకు దూరంగా ఉంటానని అన్నారు. అలాగే రోజూ ఉదయాన్నే శరీరానికి కావాల్సిన హైడ్రేట్ కోసం నీళ్లు తీసుకుంటారట. ఉదయాన్నే సరైనంత నీళ్లు తాగి తన రోజూ ప్రారంభిస్తారట. అలాగే యోగా, మెడిటేషన్ తో రిలాక్స్ అవుతుంటారట.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

అలాగే ఫిట్ గా ఉండేందుకు.. జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేస్తుంటారట. వెయిట్ ట్రైనింగ్ కోసం..పుల్ అప్స్, పుష్ అప్స్, చిన్ అప్స్ చేస్తుంటారట.. చైతూ భోజనప్రియుడు. తనకు నచ్చిన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. చైతూ విదేశీ వంటకాలను ఇష్టంగా తింటారు. కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత శరీరానికి సరిపడ వ్యాయామాలు చేస్తుంటారట.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్