
టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఇన్ని సంవత్సరాల తన సినీప్రయాణంలో తాను సంపాదించుకున్న ఆస్తి దివంగత కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన చివరి రోజుల్లో జరిగిన ఓ విషయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆఖరి రోజున తన కుమార్తెను ఎమ్మెస్ నారాయణ పిలిచి పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్యను కలవాలని ఉందని.. ఆయనను పిలిపించు అని రాశారట. ఆ తర్వాత ఎమ్మెస్ నారాయణ కూతురు బ్రహ్మానందానికి ఫోన్ చేసి విషయం చెప్పారట.
ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..
అప్పుడే ఏదో షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం పర్మిషన్ తీసుకుని మరీ ఆసుపత్రికి వచ్చారట. అప్పుడు ఆయన చేతిని పట్టుకుని ఎమ్మెస్ నారాయణ కాసేపు అలా ఉండిపోయారట. ఆ సమయంలో ఎమ్మెస్ కళ్ల నుంచి కన్నీరు అలా జారుతూ వచ్చిందట… ఆ సమయంలో అంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా తనను పిలిచాడని… ఎంతో ప్రేమ, అభిమానం ఉండి ఉంటే అలా తనను అలాంటి సమయంలో పిలిచి ఉంటాడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం. ఎమ్మెస్ నారాయణ మాత్రమే తాను సంపాదించుకున్న ఆస్తి అన్నారు.
ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..
ఎమ్మెస్ నారాయణ.. సినీరంగంలో బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న కమెడియన్. ఆయన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే తనతో గడిపిన క్షణాలను, సినిమా షూటింగ్ విషయాలను పంచుకున్నారు బ్రహ్మానందం.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్.. ఆఖరి రోజు ఊహించని రిజల్ట్..
ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..