Salaar: ప్రభాస్ సలార్ మూవీలో కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు.. నెగిటివ్ రోల్‌లో

ఇప్పుడు సలార్ సినిమా భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలల్లో ఫ్యాన్స్ కు కావాల్సిన యాక్షన్ సీన్స్, మాస్ ఎలివేషన్ లేవు. కానీ ఇప్పుడు చేస్తున్న సలార్, కల్కి సినిమాల్లో ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి.

Salaar: ప్రభాస్ సలార్ మూవీలో కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు.. నెగిటివ్ రోల్‌లో
Salaar

Updated on: Jul 24, 2023 | 4:32 PM

ప్రభాస్ నటిస్తున్న నయా మూవీ సలార్. బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలతో ఆడియన్స్ ను, ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తున్నారు డార్లింగ్. ఈ మధ్య ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా వచ్చిన ఆదిపురుష్ సినిమా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు సలార్ సినిమా భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలల్లో ఫ్యాన్స్ కు కావాల్సిన యాక్షన్ సీన్స్, మాస్ ఎలివేషన్ లేవు. కానీ ఇప్పుడు చేస్తున్న సలార్, కల్కి సినిమాల్లో ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి. దాంతో ఈ మూవీస్ పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సలార్ , కల్కి సినిమాలనుంచి గ్లింమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రెండు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

ఇదిలా సలార్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. అలాగే ప్రభాస్ సరసన సలార్ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించనున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా నటిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ.. సలార్  సినిమాలో నటిస్తున్నా.. ఆ సినిమాలో నాది నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు.

Brahmaji