టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఒకరు.. అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఇప్పుడు స్టార్ హీరోలు కూడా సందీప్‌తో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2023లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఈ సినిమా పై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయింది. అంతకు ముందు ‘కబీర్‌సింగ్’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు సందీప్. యానిమల్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సందీప్ డిమాండ్ రెట్టింపు అయ్యింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం గురించి. ఇందులో నటించే నటీ నటుల గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా డైరెక్టర్. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో బాలీవుడ్ నటీనటులు నటిస్తారని టాక్ వినిపిస్తుంది. కొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిలో సైఫ్ అలీ ఖాన్ , కరీనా కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్‌లు బాలీవుడ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఈ జంట ‘స్పిరిట్’ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. వీరిద్దరూ ప్రభాస్ సినిమాలో విలన్‌లుగా కనిపించనున్నట్టు కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ ఎక్కడ చూసినా గాసిప్ స్ప్రెడ్ అవుతుంది. సైఫ్ ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్, రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర సినిమాల్లో విలన్ గా చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించనున్నాడని టాక్. అలాగే అతని భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.