తోడు కోసం తహతహలాడుతున్న నిర్మాత… 53ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్నానంటూ ఎమోషనల్

చాలామంది వయసు పెరుగుతున్నా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్ గ గడిపేస్తుంటారు. కొంతమంది పలువురితో రిలేషన్ షిప్స్ పెట్టుకొని ఆతర్వాత పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటారు. తాజాగా ఓ సీనియర్ దర్శకుడు, నిర్మాత తోడు కోసం ఆరాటపడుతున్నాడు. 53ఏళ్ల ఆ నిర్మాత ఒంటరిగా ఉన్నా అంటూ ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు.

తోడు కోసం తహతహలాడుతున్న నిర్మాత... 53ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్నానంటూ ఎమోషనల్
Tollywood News

Updated on: Nov 10, 2025 | 12:27 PM

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల గురించి నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా సెలబ్రెటీల ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ ఇలా ఎన్నో రకాల వార్తలు అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది పెళ్లి అనేది లేకుంగా తమ వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ 40ఏళ్ల వయసు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొందరు హీరోలు, డైరెక్టర్స్ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యూసర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. 53 ఏళ్ల ఆ సీనియర్ దర్శకుడు, నిర్మాత ఇప్పుడు తోడు కోసం తహతహలాడుతున్నాడు. ఇంతకూ ఆ నిర్మాత ఎవరు..? 53ఏళ్ల వయసులో ఆయనకు పెళ్లి పై గాలి ఎందుకు మళ్లిందో చూద్దాం.!

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

ఆయన ఎవరో కాదు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్..ఈ ప్రొడ్యూసర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నిర్మించాడు కరణ్. అలాగే స్టార్ కిడ్స్ ను చాలా మందిని తన బ్యానర్ ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. సినిమాలతోనే కాదు టాక్ షో ద్వారా కూడా కరణ్ జోహార్ చాలా పాపులర్ అయ్యాడు. కాఫీ విత్ కరణ్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఎన్నో వివాదాస్పద ప్రశ్నలు కూడా అడిగి వార్తల్లో నిలిచాడు కరణ్.

దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కరణ్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు కరణ్. తల్లి లేకపోయినా ఆ ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసుంటున్నాడు. తాజాగా కరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.. తల్లి లేకుండా ఇద్దరి పిల్లలకు తాను తండ్రిగా మారాను, పిల్లలు పెద్దయిన తర్వాత ఈ విషయం పిల్లలకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదని భావోద్వేగానికి గురయ్యాడు.  ఒంటరితనం గురించి ఆలోచిస్తే ఒకొక్కసారి భోజనం కూడా చేయాలనిపించదని తెలిపాడు.. అలాగే ఏదైనా ఈవెంట్ కు వెళ్తే అందరూ తమ పార్ట్నర్స్ తో సంతోషంగా వస్తుంటారు. కానీ నేను మాత్రం ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల నేషనల్ అవార్డు వేడుకలో అందరూ కపుల్స్ గా వస్తే నేను మాత్రం ఒంటరిగా వెళ్ళా.. అప్పుడు నన్ను కొందరు మీ పార్ట్నర్ ఎక్కడ అని అడిగారు. నాకు ఎంతో బాధగా అనిపించింది. బహుశా దేవుడు నాకోసం ఎవరిని పుట్టించలేదేమో.. ఏదైనా ఈవెంట్ కు నా పిల్లలతో కలిసి వెళ్దామా అంటే వాళ్లు చిన్నపిల్లలు.. మా అమ్మతో వెల్దామంటే ఆమె అంత దూరం రాలేదు. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది అందరూ జంటగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు కానీ నేను మాత్రం ఒంటరిగా ఉండాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు కరణ్. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.