సినిమా తరాల జీవితాల్లో చాలా విషాద ఘటనలు, చేదు అనుభవాలు ఉంటాయి. కానీ అవి చాలా మందికి తెలియదు. ఇక వారి వైవాహిక జీవితాలు కూడా అంత సజావుగా సాగవు. చాలా మంది సినిమా తారలు పేమించి పెళ్లిచేసుకున్నా కూడా మనస్పర్థల కారణంగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది హీరోయిన్స్ తన వివాహ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన మాజీ భర్త గూరించి షాకింగ్ విషయాలు పంచుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల బాలీవుడ్ భామ కరీష్మా కపూర్. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ భామ. టాప్ హీరోల తో జతకట్టింది ఈ భామ. ఈ క్రమంలోనే 2003లో బిజినెస్ మెన్ సంజయ్ కపూర్ ని పెళ్లాడింది ఈ బ్యూటీ. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణముగా విడిపోయారు.
2016లో వీరి విడిపోయారు. భర్తనుంచి విడిపోయిన తర్వాత కరిష్మా తన విడాకుల గురించి ఎక్కడ ఎక్కువగా ప్రస్తావించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ భర్త తనను చిత్రహింసలు పెట్టేవాడిని చెప్పుకొచ్చింది. విపరీతంగా కొట్టేవాడని.. అతని తల్లి కూడా అతడికి సహకరించేది తెలిపింది.
పెళ్ళైన కొత్తలో తన అత్తా ఒక డ్రస్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట. బాబు పుట్టిన తర్వాత అదే డ్రస్ వేసుకోవాలని చెప్పింది. కానీ అది తనకు సరిపోదని.. బాబు పుట్టిన తర్వాత కొద్దిగా లావు అయ్యానని చెప్పను. దానికి ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసింది. తన కొడుకుని నన్ను కొట్టమని చెప్పింది. అతడు కూడా నన్ను కొట్టాడు. ఆమె కనీసం కొడుకును ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అని తెలిపింది కరిష్మా.