
సినిమా హీరోలు చాలా కలివిడిగా ఉంటారు. సినిమా షూటింగ్స్ లో ఎంతో సరదాగా సందడి చేస్తూ ఉంటారు. సినిమా యూనిట్ తో, అలాగే హీరోయిన్స్ తోనూ సరదాగా అల్లరి చేస్తూ ఉంటారు. అయితే ఓ హీరో మీద మాత్రం చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, హీరోయిన్స్ తో అణిచితంగా వ్యవహరిస్తాడు అని.. హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉంటాడని ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.? ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్నాడు స్టార్ హీరోగా రాణిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇంతకూ అతను ఎవరంటే..
బాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో వరుణ్ ధావన్. ఈ యంగ్ హీరో తన కోస్టార్ట్స్ తో మాట్లాడేటప్పుడు తరచుగా హద్దులు అతిక్రమిస్తాడని కొందరు ఆరోపిస్తున్నారు. గతంలో వరుణ్ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో అతను నటి కియారా అద్వానీ అనుమతి లేకుండా చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. లైవ్ ఈవెంట్‌లో నటి అలియా భట్ నడుమును తాకాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడంతోపాటు వరుణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటీమణులతో వరుణ్ ప్రవర్తన సరిగా లేదని చాలా మంది విమర్శించారు. ఇప్పుడు దీనిపై వరుణ్ స్వయంగా స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను ఈ ప్రశ్న అడిగారు.
వరుణ్ మాట్లాడుతూ.. ‘నా కో స్టార్స్ తో నేను చాలా సరదాగా ఉంటాను. అయితే దాన్ని ఎవరూ తప్పుగా తీసుకోరు’ అని వరుణ్ ధావన్ అన్నాడు. ఈసారి కియారాతో ముద్దుల సన్నివేశం గురించి ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. ‘మేము ఆ ముద్దు గురించి ముందే ప్లాన్ చేసుకున్నాం. కియారా, నేను ఇద్దరం ఆ క్లిప్‌ని పోస్ట్ చేసాము. మేము ఆ వీడియోను కావాలనే షూట్ చేశాం. మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాం. కియారా చాలా మంచి నటి. ఆ ముద్దుల సీన్ ముందే ప్లాన్ చేసుకున్నది’ అని వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ‘జగ్ జగ్ జియో’ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరుణ్ కియారా నడుము పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టడం పై వరుణ్ మాట్లాడుతూ.. ‘ఇది ముందుగా ప్లాన్ చేయలేదు. నేను కావాలని చేశాను. అయితే ఇదంతా హాస్యాస్పదంగా జరిగింది. నేను చాలా సరదాగా ఉండే వ్యక్తిని’ అన్నాడు. అలాగే ఓ ఈవెంట్‌లో వరుణ్ అలియా నడుమును తాకడం గురించి కూడా అతను మాట్లాడాడు. ‘సరదా కోసం చేశాను. దీన్నే సరసాలు అనరు. మేం మంచి స్నేహితులం అని వరుణ్ చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.