Jacqueline Fernandez: ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ను వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్  జాక్వెలిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలంకకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిందీ ముద్దుగుమ్మ.

Jacqueline Fernandez: ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ను వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్  జాక్వెలిన్
Jacqueline Fernandez

Updated on: Mar 26, 2025 | 11:03 AM

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ సినిమాలు చేస్తూ ముంబైలోనే సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాగా జాక్వెలిన్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభాస్ నటించిన సాహో మూవీలో నూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఎక్కువ. అదే సమయంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జైలులో ఉన్న సుకేశ్ చంద్ర శేఖర్ కేసులో జాక్వెలిన్ పేరు తరచుగా వినిపిస్తుంటుంది. కాగా ప్రస్తుతం తల్లితో కలిసి ముంబైలోనే నివాసముంటోంది జాక్వెలిన్. ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఆమె తాజాగా ఆస్పత్రిలో కనిపించింది. ఆమె తల్లి కిమ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడమే దీనికి కారణం. ప్రస్తుతం కిమ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యల బారిన పడిన ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం జాక్వెలిన్ తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

కాగా జాక్వెలిన్ కు ఐపీఎల్ నుంచి ఒక బంపరాఫర్ వచ్చింది. అదేంటంటే.. ధనా ధన్ టోర్నీలో భాగంగా గురువారం (మార్చి 27) గౌహతి వేదికగా కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై స్పెషల్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉందట. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి వెంటనే నో చెప్పేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో జాక్వెలిన్ తల్లి త్వరగా కోలుకోవాలంటూ సినీ అభిమానులు, నెటిజన్లు

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.