
సినీరంగంలోకి అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ రావడం.. సక్సెస్ కావడమంటే అతిశయోక్తి కాదు. నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ ఎక్కువగా తిరస్కరణలు, అవమానాలు, విమర్శలతో బాధపడిన తారలు చాలామంది ఉన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సూపర్ స్టార్లుగా మారిన హీరోయిన్స్.. ఇప్పుడు తమ కెరీర్ మొదటి రోజులను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. సైతం 17 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ అందాల భామ చెల్లి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ ఆమె అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. మా చెల్లికి మొగుడు కావాలి అని అంటుంది. అర్జెంట్ గా మా చెల్లికి పెళ్లి చేయాలి అంటుంది ఆ హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
శిల్పా శెట్టి.. భారతీయ సినీప్రియులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో నిర్మాతల నుంచి అనేక తిరస్కరణను ఎదుర్కొంది. సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదట్లో ఆమె చాలా అవమానాలను ఎదుర్కొందట. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వెయకుండా తన ప్రయత్నాలను వదులుకోలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో శిల్పాశెట్టి ఓ స్టార్ హీరోయిన్.. తెలుగులోనూ రెండు మూడు సినిమాలు చేసింది శిల్పాశెట్టి. ఇక శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది.
తాజాగా ఓ షోలో శిల్పాశెట్టి ఆమె చెల్లి షమితా శెట్టి హాజరయ్యారు. ఈ షోలో శిల్పా మాట్లాడుతూ.. నేను ఎవరిని చూసినా త్వరగా ఇంప్రెస్ అవుతా.. నాకు ఎవరైనా కనిపిస్తే మీకు పెళ్లయిందా అని ముందు అడుగుతా.. నాకు అస్సలు సిగ్గు లేదు.. నేను అలా అడగ్గానే ఈవిడేంటి ఇలా అడుగుతుంది.. ఈమెకు పెళ్లయింది కదా అని అనుకుంటారు. కానీ వెంటనే ‘నా కోసం కాదులెండి, మా చెల్లెలి కోసం’ అని చెబుతాను. అని శిల్పా సరదాగా చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి