
సాధారణంగా దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కొందరు ఇప్పటికే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాధిక, మీనా, ఖుష్బూ, ఊర్వశి, శ్రియా, కాజల్ వంటి హీరోయిన్స్ ఇప్పుడు సినిమాల్లో సహయ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ దాదాపు 24 ఏళ్ల తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. తమిళ్ హీరో విజయ్ ఆంటోని నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్. ఆమె మళ్లీ తమిళంలో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రవీనా టాండన్.. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే నిర్మాతగానూ రాణించింది. బెంగాళీ, కన్నడ, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో అర్జున్ కు జతగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమల్ హాసన్ సరసన ఆళవందాన్ అభయ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత మళ్లీ తమిళంలో సినిమా చేయలేదు.
హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవీనా టాండన్.. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో నటించింది. ఇందులో భూమిక పాత్రలో కనిపించింది. తెలుగులోనూ అడపా దడపా చిత్రాల్లో నటిస్తునన రవీనా.. ఇప్పుడు చాలా కాలం తర్వాత తమిళ్ అడియన్స్ ముందుకు వస్తుంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..