సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది మాట్లాడారు. తమ సినీ కెరీర్ లో ఎదురురైనా చేదు అనుభవాల గురించి చాలా మంది హీరోయిన్స్ దైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో షాకింగ్ విషయం చెప్పారు హీరోయిన్స్. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. ఈ రిపోర్ట్ లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలాగే రిపోర్ట్ తర్వాత కూడా కొంతమంది తమకు ఎదురైన చేదు అనుభవాలగురించి, ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కూడా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 16 ఏళ్ల వయసులో ఓ చేదు సంఘటనను ఎదుర్కొన్నాను అని తెలిపింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రష్మీ దేశాయ్.
రష్మీ దేశాయ్ భోజ్‌పురి నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2006లో జీ టీవీలో ప్రసారమైన రావణ్ సీరియల్‌లో మండోదరి పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హిందీ సీరియల్ ఉత్తరన్‌లో నటించిన తర్వాత రష్మీ దేశాయ్ బాలీవుడ్ అభిమానులలో క్రేజ్ తెచ్చుకుంది. ఈ సీరియల్ ద్వారా అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. దీని తరువాత, ఈ బ్యూటీ దిల్ సే దిల్ తక్, ఝలక్ థిక్లా జా, ఖత్రోన్ కే ఖిలాడీ సీరియల్‌లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మీ దేశాయ్ మాట్లాడుతూ..
రష్మీ దేశాయ్ మాట్లాడుతూ.. ” ఓ సినిమా కోసం నన్ను ఆడిషన్ కోసం పిలిచారు. అప్పుడు నా వయసు కేవలం 16 ఏళ్లు. ఆడిషన్ కు నన్ను ఒంటరిగా రమ్మన్నారు. దాంతో నేను కాస్త తడబడ్డాను. అక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు తాను నన్ను ఓ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అతను ఏమి చేసాడో నాకు తెలియదు. కొద్దిసేపటికే నేను అపస్మారక స్థితిలోకి వెళ్లి స్పృహ కోల్పోయాను. ఆ సమయంలో చాలా అసౌకర్యంగా అనిపించి, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుని బయటకు వచ్చేశాను. తర్వాత ఇంటికి వెళ్లి మా అమ్మకు అంతా చెప్పా.. మరుసటి రోజు మా అమ్మ, నేను ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళాము. నాతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఆ వ్యక్తికి గుణపాఠం చెప్పాలని మా అమ్మ అతని చెంపపై కొట్టింది. ఆ వ్యక్తికి ఇది ఖచ్చితంగా మరిచిపోలేని రోజు అని నేను భావిస్తున్నాను. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతాయి. ప్రతి రంగంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. సినిమా పరిశ్రమలో మంచి అనుభవాన్ని పొందేందుకు కొంతమంది అద్భుతమైన వ్యక్తులతో కలిసి చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది రష్మీ దేశాయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.