Kiara Advani: క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాలో న‌టిస్తానంటోన్న కియారా.. ఆ చిత్రం ఎన్టీఆర్‌దేనా..?

Kiara Advani: 2014లో వ‌చ్చిన ఫ‌గ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌టి కియారా అద్వానీ. త‌న‌దైన న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది అన‌తి కాలంలోనే న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక నాలుగో చిత్రంతోనే...

Kiara Advani: క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాలో న‌టిస్తానంటోన్న కియారా.. ఆ చిత్రం ఎన్టీఆర్‌దేనా..?
Kiara

Updated on: Jun 14, 2021 | 5:57 AM

Kiara Advani: 2014లో వ‌చ్చిన ఫ‌గ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌టి కియారా అద్వానీ. త‌న‌దైన న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది అన‌తి కాలంలోనే న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక నాలుగో చిత్రంతోనే సౌత్ ఇండియాపై దృష్టి సారించిన కియారా.. మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన భ‌ర‌త్ అనే నేని సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా వ‌చ్చి దాదాపు మూడేళ్లు గ‌డుస్తోన్నా కియారా ఇంత వ‌ర‌కు మ‌రో తెలుగు చిత్రంలో న‌టించ‌లేదు. తాజాగా ఈ విష‌య‌మై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిందీ బ్యూటీ.
కియారా అద్వానీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి జూన్ 13తో 7 ఏళ్లు గ‌డిచాయి. ఈ సంద‌ర్భంగా #7YearsOfKiaraAdvani అనే హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగానే ఓ ట్విట్ట‌ర్ యూజర్ మ‌ళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు న‌టిస్తార‌ని ప్ర‌శ్నించాడు. దీనికి స్పందించి ముద్దుగుమ్మ క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాను చేస్తా అని చెప్పుకొచ్చింది. దీంతో కియారా అద్వానీ న‌టించే ఆ తెలుగు సినిమా మ‌రేదో కాద‌ని.. ఎన్టీఆర్ 30వ చిత్రమేన‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

కియారా అద్వాని చేసిన ట్వీట్‌..

Also Read: 1000 years old egg: తవ్వకాల్లో లభించిన అరుదైన నిధి.. ఆ కోడిగుడ్డు వెయ్యి ఏండ్లు.

Salman Khan: మరో సూపర్ హిట్ సినిమాపైన కన్నేసిన సల్మాన్.. విజయ్ సినిమాను రీమేక్ చేయనున్న భాయ్ జాన్..

మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ

Loading...
Unable to load recommendations.
Follow Us