Khushi Kapoor: సినిమాల్లోకి రాకముందే కోట్లు సంపాదిస్తున్న జాన్వీ చెల్లెలు.. ఖరీదైన కారు కొన్న ఖుషీ కపూర్..

|

Aug 11, 2024 | 8:24 PM

అలాగే మరో రెండు సినిమాల్లో నటిస్తుంది జాన్వీ. అయితే ఈ హీరోయిన్ చెల్లెలు మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే కోట్లు సంపాదిస్తుంది. బ్రాండ్ ప్రకటనలలో నటిస్తూ.. అలాగే సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Khushi Kapoor: సినిమాల్లోకి రాకముందే కోట్లు సంపాదిస్తున్న జాన్వీ చెల్లెలు.. ఖరీదైన కారు కొన్న ఖుషీ కపూర్..
Khusi Kapoor
Follow us on

దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా ఉన్న జాన్వీ ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే మరో రెండు సినిమాల్లో నటిస్తుంది జాన్వీ. అయితే ఈ హీరోయిన్ చెల్లెలు మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే కోట్లు సంపాదిస్తుంది. బ్రాండ్ ప్రకటనలలో నటిస్తూ.. అలాగే సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొత్త రెడ్ కలర్ మెర్సిడెజ్కారుతో తిరుగుతూ ముంబై వీధుల్లో కనిపించింది. ఖుషీ కపూర్ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్నఅభిమానులు నటికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖుషీ కపూర్ ఇప్పటికే ది ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం బెట్టి కూపర్ పాత్రలో మెప్పించింది. 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకోపియంది. ఇందులో సుహానా ఖాన్, అగస్త్యానందా కీలకపాత్రలలో నటించారు.

ఇదిలా ఉంటే ఖుషీ కపూర్ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీగా వస్తోన్న నాడనియాన్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేస్తోన్న లవ్ టుడే చిత్రంలో నటించనుంది. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన ఉప్పెన సినిమాను హిందీలో రీమేక్ లో నటించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.