Tollywood: సంతాన ప్రాప్తి కోసం ఆ ప్రసిద్ధ ఆలయంలో పూజలు చేసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్

తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఒక స్టార్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. 2021లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ సంతానం కోసం దేశంలోని గుళ్లన్నీ తిరిగేస్తోంది. ప్రత్యేక పూజలు, పుణ్య స్నానాలు ఆచరిస్తోంది.

Tollywood: సంతాన ప్రాప్తి కోసం ఆ ప్రసిద్ధ ఆలయంలో పూజలు చేసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Tollywood Actress

Updated on: Mar 14, 2025 | 2:27 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గత కొద్ది కాలంగా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన అత్తగారితో కలిసి షిర్డీలోని సాయి ఆలయాన్ని సందర్శించింది. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసింది. అక్కడి సాధువులతో కలిసి భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. తాజాగా కత్రినా కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది. సుమారు 4 నుంచి 5 గంటలు కత్రినా పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాగా కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని నమ్మకం. అలాగే పెళ్లయిన అమ్మాయిలు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్మకం. ఈ క్రమంలోనే ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కత్రినా కైఫ్ ప్రస్తుతం ఎలాంటి చిత్రాల్లోనూ నటించడం లేదు. చివరిసారిగా ఆమె విజయ్ సేతుపతి సరసన ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో కనిపించింది. గతేడాది ఈ మూవీ రిలీజైంది. అయితే ఇప్పుడు హోలీ పండగ సందర్భంగా, కత్రినా 2007 చిత్రం ‘నమస్తే లండన్’ వెండితెరపై తిరిగి విడుదల కానుంది. ఇందులో ఆమె అక్షయ్ కుమార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయంలో కత్రినా కైఫ్ పూజలు..

ఆలయంలో ప్రదక్షిణలు చేస్తోన్న కత్రినా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.