Katrina Kaif: తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరి’.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్

బాలీవుడ్ సెలబ్రిటీ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా కైఫ్ ప్రస్తుతం గర్భంతో ఉంది. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను వారే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఈ సెలబ్రిటీ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Katrina Kaif: తల్లి కాబోతున్న మల్లీశ్వరి.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్
Katrina Kaif, Vicky Kaushal

Updated on: Sep 23, 2025 | 1:32 PM

టాలీవుడ్ మల్లీశ్వరి తల్లి కాబోతుంది. అదేనండి.. బాలీవుడ్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు. ‘ కొత్త ఆధ్యాయం ప్రారంభం కానుంది. మా జీవితంలో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నాం’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు విక్కీ-కత్రినా. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజనలు కత్రినా-విక్కీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  విక్కీ , కత్రినాలది ప్రేమ వివాహం.  2021 డిసెంబర్‌ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు.   రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ లోని ఫోర్ట్ బార్వారా లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్ లో  వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కత్రినా-విక్కీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కానున్నారు. దీంతో ఈ జంట ఆనందానికి అవధుల్లేవు.

 

ఇవి కూడా చదవండి

కత్రినా  కైఫ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించింది. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మల్లీశ్వరి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది. మధ్యలో నందమూరి బాలకృష్ణతో కలిసి అల్లరి పిడుగు అనే సినిమాలో సందడి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతోంది కత్రినా.

 

కత్రినా-విక్కీ దంపతుల ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో బయోపిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఆ మధ్యన ఛావా సినిమాతో మరోసారి దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడీ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.