AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: దేవర విలన్‏కు హత్య బెదిరింపులు.. సైఫ్ కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ద్వారా సౌత్ అడియన్స్ ముందుకు వచ్చాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఈ మూవీలో రావణసుర పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోనూ ప్రతినాయకుడిగా నటించాడు. తాజాగా సైఫ్ గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

Saif Ali Khan: దేవర విలన్‏కు హత్య బెదిరింపులు.. సైఫ్ కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్స్..
Saif Ali Khan
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2024 | 10:10 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అళీ ఖాన్ ఒకప్పుడు లవర్ బాయ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అలరించారు. ఈ హీరోకు నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్లుగా హీరోగా మెప్పిస్తున్న సైఫ్ ఇప్పుడు టర్న్ తీసుకున్నారు. విలన్ పాత్రలతో వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. ఇటీవలే దేవర సినిమాలో భైరా పాత్రలో కనిపించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే దేవర పార్ట్ 2లో నటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలకు వరుసగా హత్యా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే వంటి హీరోలను చంపేస్తామని కొందరు ఆగంతులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు బీటౌన్ హీరోలకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ హత్య బెదిరింపులు సైఫ్ కు సైతం వచ్చాయట. కానీ ఇప్పుడు కాదు. గతంలో తన పెళ్లి జరిగిన తర్వాత వచ్చాయని అన్నారు సైఫ్.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతాంతర వివాహం కారణంగా వీరిద్దరికి బెదిరింపులు వచ్చాయట. ఈ విషయాన్ని సైఫ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.  సైఫ్-కరీనా పెళ్లిని చాలా మంది వ్యతిరేకించారు. సైఫ్‌ను పెళ్లి చేసుకోవద్దని చాలా మంది కరీనాకు సలహా కూడా ఇచ్చారు. కానీ సైఫ్-కరీనా దేనిపైనా దృష్టి పెట్టకుండా, తమ భావాలకు ప్రాముఖ్యతనిచ్చి అక్టోబర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక వీరికి బెదిరింపులు వచ్చాయట.

“మా పెళ్లిని చాలా మంది వ్యతిరేకించారు. మా బావ రణబీర్ కపూర్ కు అజ్ఞాత లేఖ వచ్చింది. అందులో మా కుటుంబాన్ని చంపేస్తామని.. మా ఇంటి దగ్గర బాంబు పెట్టి పేలుస్తామని రాశారు. కానీ అది మమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. గతంలో కూడా మా కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో నేను ఎప్పుడూ ఆలోచించను. బెదిరింపులకు, బెదిరింపులను నిజం చేయడానికి చాలా తేడా ఉంది. మతాంతర వివాహం కావడంతో నా తల్లిదండ్రులకు కూడా అలాంటి బెదిరింపులు వచ్చాయి” అని సైఫ్ చెప్పుకొచ్చారు. సైఫ్ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా మతాంతర వివాహం చేసుకున్నారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..