Harihara Veeramallu : పవన్ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు.. హరిహర వీరమల్లు కోసం..

|

Oct 29, 2022 | 4:02 PM

క్రిష్ దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం.

Harihara Veeramallu : పవన్ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు.. హరిహర వీరమల్లు కోసం..
Pawan Kalyan Harihara Veera
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. ఇటీవలే భీమ్లానాయక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు ఈ భారీ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రిష్ దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఇక ఇప్పుడు పవన్ ఈ సినిమాను వీలైంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు. మొహాలయిలు కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే పవన్ సరసన  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా కోసం పవన్ కర్రసాము ప్రాక్టీస్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా లో ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ ను ఎంపిక చేశారు. ఈయన ఇటీవల వచ్చిన ఆశ్రమం అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్ కెరీర్ లో అతంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ డవలప్ చేసే పనిలో ఉన్నారు హరీష్. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..