Akshay Kumar: మరోసారి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..! అక్షయ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే
సూర్య ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దు రా.. గా డబ్ అయ్యింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూర్య తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇక ఇప్పుడు ఇదే సినిమాతో అక్షయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఖిలాడీ ఆఫ్ బాలీవుడ్ అని పిలుచుకునే అక్షయ్ కుమార్ త్వరలో ‘సర్ఫీరా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం సౌత్ సినిమా డైరెక్టర్ తో అక్షయ్ చేతులు కలిపాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘సర్ఫీరా’ ఒరిజినల్ వెర్షన్ ‘సూరరై పొట్రు’కి దర్శకత్వం వహించిన సుధా కొంగర. సూర్య ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దు రా.. గా డబ్ అయ్యింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూర్య తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇక ఇప్పుడు ఇదే సినిమాతో అక్షయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
అక్షయ్ కుమార్ గత 33 ఏళ్లుగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నాడు. అతని మొదటి చిత్రం 1991లో విడుదలైన ‘సౌగంధ్’. 3 దశాబ్దాల తన కెరీర్‌లో, అక్షయ్ బాలీవుడ్‌తో పాటు సౌత్ దర్శకులతో చాలాసార్లు పనిచేశాడు. 2000 సంవత్సరంలో విడుదలైన ‘హేరా ఫేరి’ సౌత్ దర్శకులతో అతని మొదటి చిత్రం. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. వసూళ్ల పరంగా ఈ సినిమా యావరేజ్‌గా నిలిచినప్పటికీ ఆడియన్స్ కు మాత్రం బాగా నచ్చింది. ఆ తర్వాత గత 21 ఏళ్లలో సౌత్ దర్శకులతో అక్షయ్ ఐదు సినిమాలు చేశాడు. మరి వాటిలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకపోవడం రికార్డు. ఇక ఇప్పుడు మరోసారి సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు అక్షయ్ ఫ్యాన్స్. అక్షయ్‌కి ఈ సినిమా విజయం చాలా ముఖ్యం. ఎందుకంటే, ‘రామసేతు’ (2022- యావరేజ్), ‘OMG 2’ (2023- సూపర్‌హిట్)ను పక్కన పెడితే, 2022 సంవత్సరం తర్వాత, ఇప్పటి వరకు ఆయన నటించిన 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షాబంధన్’, ‘సెల్ఫీ’, ‘మిషన్ రాణిగంజ్’, ‘బడే మియా ఛోటే మియా ‘ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో అక్షయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సర్ఫీరా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.