బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్‌లో బంధుప్రీతి చర్చ అయినా లేదా దేశంలో ఏదైనా సమస్య అయినా, కంగనా తన ప్రకటనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముక్కు సూటిగా మాట్లాడుతూ బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది. తాజాగా కంగనా ఇదే తరహాలో మరో ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగళూరులోని ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ 24 పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అంతేకాకుండా, జౌన్‌పూర్‌కు చెందిన న్యాయమూర్తి రీటా కౌశిక్ పేరును ప్రస్తావిస్తూ రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు లేఖలో ఆరోపించాడు. సుభాష్ సూసైడ్ వీడియోతో పురుషుల భద్రత చట్టాలకు సంబంధించిమరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా ఈ విషయంపై స్పందించారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య విషయాన్ని సమీక్షించాలని, ఇలాంటి ఘటనలను ఎదుర్కోవడానికి ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయాలని కంగనా అన్నారు. ‘ఈ ఘటనతో దేశమే దిగ్భ్రాంతికి గురైందన్నారామె. అతుల్ ఆఖరి వీడియో గుండెను పిండేస్తోంది. మన భారతీయ సంప్రదాయాంలో పెళ్లి సంబంధం ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ అందులో కమ్యూనిజం, సోషలిజం, ఒక విధంగా ఖండించదగిన స్త్రీవాదం అనే పురుగులు సమస్యాత్మకంగా మారిపోయాయి. కొంతమంది దీన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు’ అని కంగనా అన్నారు. అతుల్ విషయం గురించి స్పందిస్తూ.. ‘అతడి ఆర్థిక పరిస్థితికి మించి తన దగ్గరి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడికి వల్ల అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ ఒక్క సంఘటన వల్ల మహిళలందర్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవారిదే తప్పుంటుంది. అందుకే ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది’ అని కంగనా చెప్పుకొచ్చారు.
Watch: Actor and #BJP MP Kangana Ranaut speaks on Bengaluru techie death case, she said “The entire country is in shock. His video is heartbreaking… Fake feminism is condemnable. Extortion of crores of rupees was being done. Having said that, in 99 per cent of marriage cases,… pic.twitter.com/FrpQzJPdzF
— Mirror Now (@MirrorNow) December 11, 2024
కాగా కంగనా చేసిన ప్రకటనపై ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కంగనా వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి