Madhavi Latha: జనం జగన్ వైపే.. మళ్లీ ఆయనే సీఎం.. ప్రముఖ నటి, బీజేపీ నేత మాధవీలత.. వీడియో

|

Mar 16, 2024 | 12:26 PM

ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడే ఆమె రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా కచ్చితంగా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారంటూ బల్ల గుద్ధి చెప్పారు. ఈ మేరకు ఫేస్‌ బుక్‌ లో ఒక వీడియోను షేర్ చేశారామె

Madhavi Latha: జనం జగన్ వైపే.. మళ్లీ ఆయనే సీఎం.. ప్రముఖ నటి, బీజేపీ నేత మాధవీలత.. వీడియో
CM Jagan, Madhavi Latha
Follow us on

ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడే ఆమె రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా కచ్చితంగా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారంటూ బల్ల గుద్ధి చెప్పారు. ఈ మేరకు ఫేస్‌ బుక్‌ లో ఒక వీడియోను షేర్ చేశారామె. ‘ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. అయితే ‘పొత్తు పెట్టుకున్నాం.. సులభంగా గెలిచేద్దాం.. జగన్ ని సాగనంపుదాం’ అంటే మాత్రం అంత సులభమేమీ కాదు. ఆయన దగ్గర బలమైన రాజకీయ ప్రణాళికలు ఉన్నాయ. అలాగే పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించారు. కాబట్టి మళ్లీ జగనే గెలిచే అవకాశం ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఓడించాలంటే పొత్తు పార్టీలు ఎంతో కష్టపడాలి. మూడు పార్టీలు చేతుల కలిపినంత మాత్రాన అది సాధ్యం కాదు. కార్యకర్తలు కూడా సమష్ఠిగా కృషి చేయాలి. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆకట్టుకోవాలి’

‘మూడు పార్టీలు కష్టపడి పనిచేస్తే తప్ప.. గెలిచే అవకాశాల్లేవు. సీట్లు రావా? అంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీలకు సీట్లు వస్తాయి. కానీ అధికారం వస్తుందా రాదా?? అనేదే ఇక్కడ చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరు ఏడుపులు ఆపి సమష్ఠిగా కష్టపడితేనే విజయం సాధ్యమవుతుంది. లేదంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి’ అని తన వీడియోలో చెప్పుకొచ్చింది మాధవీలత. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా బీజేపీ నాయకురాలిగా ఉన్న ఆమె వైసీపీకి సపోర్టుగా మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నాయకురాలు మాధవీలత కామెంట్స్.. వీడియో..

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..