బాబోయ్.. బిగ్ బాస్ బ్యూటీ ఇన్నాళ్లకు ఇలా.. దుమ్మురేపిందిగా

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎంతో మంది సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇఫులెన్సర్స్ బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. అలాగే తన ఆటతో బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసింది.

బాబోయ్.. బిగ్ బాస్ బ్యూటీ ఇన్నాళ్లకు ఇలా.. దుమ్మురేపిందిగా
Actress Pics

Updated on: Apr 02, 2026 | 2:02 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. కానీ ఆమె ప్రవర్తన కారణంగా ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో కంటే ముందు పలు చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. కానీ బిగ్‏బాస్ తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా పాపులర్ అయిన ఈ చిన్నది. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ అమ్మడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోల కోసం తెగ గాలించేశారు కుర్రకారు. అంతే కాదు బిగ్ బాస్ గేమ్ లోనూ ఓట్ల రూపంలో బాగానే సపోర్ట్ చేశారు.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ఈ అమ్మడు మరెవరో కాదు.. రతికా రోజ్.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులలో చురుగ్గా ఉండే రతిక.. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. మోడల్ గా పనిచేసిన రతిక.. 2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాతో కథానాయికగా మారింది.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత బిగ్‏బాస్ షోలోకి అడుగుపెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకోవాలని అనుకుంది. కానీ ఊహించని విధంగా బిగ్‏బాస్ షోతో ఆమెకు ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రతిక. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో నెటిజన్లకు మతిపోగొడుతుంది.

Follow Us