Divi Vadthya: కారు డిక్కీలో ఇరుక్కొని ఫోటోలకు ఫోజులిచ్చిన బ్యూటీ.. అమ్మడి అందాలకు ఫిదా కావాల్సిందే
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ వల్ల చాలా మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే. అప్పటివరకు సరైన ఫాలోయింగ్ లేని వాళ్ళు ఎంతో మంచి బిగ్ బాస్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చారు.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ వల్ల చాలా మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే. అప్పటివరకు సరైన ఫాలోయింగ్ లేని వాళ్ళు ఎంతో మంచి బిగ్ బాస్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చారు. కొంతమంది ఏకంగా హీరోలు కూడా అయ్యారు. అలా వచ్చిన వాళ్లలో అందాల భామలు కూడా ఉన్నారు. వారి లో ఒక్కరే దివి(Divi Vadthya). బిగ్ బాస్ కంటే ముందు మేలు సినిమాల్లో నటించిన ఈ చిన్నదానికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని అందరి కంట్లో పడింది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పలు వెబ్ సిరీస్ లతో పాటు ప్రయివేట్ ఆల్బమ్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది దివి. ఇక ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రోజూ రకరకాల ఫొటోలతో రచ్చ చేస్తోంది దివి. నెట్టింట అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు వలలు వేస్తోంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. కారు డిక్కీలో కూర్చొని మరీ ఫోటోలు దిగింది దివి. అందాలను ఏమాత్రం మొహమాటపడకుండా ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది. దాంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ఈ అమ్మడి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..