అనుకున్నదే జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయిని పంపించినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. అసలు ఈ సారి బిగ్ బాస్ సీజన్‌పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాాయి. కుమార్ సాయిని పంపిస్తారని నెటిజన్లు ముందుగానే ఊహించారు. అలా జరక్కుండా ఉండటానికి అతడికి గట్టిగానే ఓట్లు వేశారు. కానీ కుమార్ సాయికి ఉద్వాసన పలికినట్లు తెలియడం చర్చనీయాంశం అయింది. ఇందులో కుమార్ సాయి మిస్టేక్ కూడా కొంత ఉంది. ఎందుకంటే అతడు అమ్మాయిలతో లవ్ ట్రాకులు నడపలేదు. వివాదాలకు కేంద్ర బిందువు అవ్వలేదు. జస్ట్ తన ఆట తను ఆడుకుంటూ పోయాడు. జన్యూన్‌గా ప్రదర్శనకు వీలున్న టాస్కుల విషయంలో అదరగొట్టాడు. ఇంకొక విషయం ఏంటంటే కుమార్ సాయికి ఒక జట్టు అంటూ లేదు. మిగతా అందరికీ హౌస్‌లో ఎవరో ఒకరి మద్దతు ఉంది. సూపర్బ్ ఆడుతుందని నెటిజన్లు, వీక్షకులు బలంగా ఫీలయిన దేవీ నాగవల్లిని పంపినప్పుడే బిగ్ బాస్ ఎలిమినేషన్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు అని తెలియడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుంది. అసలు మోనాల్‌కు ఎవరు ఓట్లు వేస్తున్నారో తెలియదు. మెహబూబ్‌ను బిగ్ బాస్ నిర్వాహకులే కాపాడుతున్నారని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. ఇక నోయల్ ఏమంత ఎంటర్టైన్ చేస్తున్నాడన్నది వారి ప్రశ్న. ఇలా చాలా అనుమానాలు బిగ్ బాస్ షోపై వ్యక్తమవుతున్నాయి. ఇక అభిని బ్యాడ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతుందన్న టాక్ నడుస్తోంది. ప్రతి వీక్ నామినేట్ అవుతోన్న అతడికి బయటనుంచి అమితమైన మద్దతు లభిస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్‌లో పరిణామాలు చూస్తుంటే వచ్చే వారం అభి ఎలిమినేట్ అయినా ఆశ్యర్యం ఉండదేమో.