Bigg Boss 8 Telugu: ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..! మొదటి వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..

|

Sep 05, 2024 | 1:37 PM

గత సీజన్స్ కంటే ఈ సీజన్క్ చాలా భిన్నంగా ఉండనుంది. అన్నట్టుగానే.. మొదటి వారాం జరిగిన నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఒకొక్క కంటెస్టెంట్స్ ఇద్దరినీ నామినేట్ చేయాలి.. అలాగా నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు. అలా ఈ వారం హౌస్ లో నామినేషన్స్ జరిగాయి.

Bigg Boss 8 Telugu: ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..! మొదటి వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వరం పూర్తికావడానికి మరికొద్ది రోజులే ఉంది. మరి మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్స్ కంటే ఈ సీజన్క్ చాలా భిన్నంగా ఉండనుంది. అన్నట్టుగానే.. మొదటి వారాం జరిగిన నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఒకొక్క కంటెస్టెంట్స్ ఇద్దరినీ నామినేట్ చేయాలి.. అలాగా నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు. అలా ఈ వారం హౌస్ లో నామినేషన్స్ జరిగాయి. విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క. ఈ ఆరుగురు ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు.  కాగా చీఫ్స్ గా ఉన్న నిఖిల్, నైనిక, యమ్మీ ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

ఇక ఈ వారం జరిగిన నామినేషన్స్ లో కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్పారు. మరికొంతమంది కొంచం వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. ముఖ్యంగా శేఖర్ బాషా లేజీగా ఉంటున్నాడు అని అతనిని నామినేట్ చేశారు. నిజంగానే అతను పెద్దగా యాక్టివ్ గా ఎక్కడా కనిపించలేదు. ఎదో వాదిస్తున్నాడు తప్ప అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. ఆతర్వాత వంటగది విషయంలో బేబక్కను నామినేట్ చేశారు. కుక్కర్ రీజన్ చెప్పి ఒకరు, కూర రీజన్ చెప్పి ఒకరు ఆమెను నామినేట్ చేశారు.

ఇక నాగమణికంఠ.. ఇతగాడిని చాలా మంది నామినేట్ చేశారు. మనోడు పెద్దగా ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడని, అలాగే కాస్త పొగరుగా సమాధానం చెప్తున్నాడని, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని, రాజకీయం చేస్తున్నాడని ఇలా చాలా రీజన్స్ చెప్పారు. దానికి మణికంఠ ఏడుపు, సెంటిమెంట్, ఇలా చాలా అస్త్రాలు వాడాడు. ఆతర్వాత పృథ్వీని కూడా పెద్దగా యాక్టివ్ గా లేడు అని నామినేట్ చేశారు. ఇక సోనియాను ఆమె ధాటికి తట్టుకోలేక నామినేట్ చేశారు. నిజానికి సోనియా చాలా కరెక్ట్ గా.. కాస్త గట్టిగానే మాట్లాడుతుంది. ఇక ఈవారం నామినేట్ అయిన వారిలో తక్కువ ఓట్లు బెజవాడ బేబక్క పడ్డాయని తెలుస్తోంది. దాంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగమణికంఠ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో అతను సేవ్ అన్నే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ, బెజవాడ బేబక్క ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి