Bigg Boss Season 6: “మాటలు చెప్పడం కాదు”.. గీతూకి గట్టిగానే ఇచ్చిన నాగార్జున

వారాంతం వచ్చేసింది. బిగ్ బాస్ స్టేజ్ మీదకు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటిలానే హౌస్ మేట్స్ ను ఉత్సాహపరిచిన నాగ్. ఆతర్వాత వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపించారు.

Bigg Boss Season 6: మాటలు చెప్పడం కాదు.. గీతూకి గట్టిగానే ఇచ్చిన నాగార్జున
Bigg Boss 6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 11, 2022 | 9:04 AM

వారాంతం వచ్చేసింది. బిగ్ బాస్(Bigg Boss Season ) స్టేజ్ మీదకు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటిలానే హౌస్ మేట్స్ ను ఉత్సాహపరిచిన నాగ్. ఆతర్వాత వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపించారు. ఒకొక్కరికి క్లాస్ తీసుకున్నారు నాగ్. ఈ క్లాస్ లో అనుకున్నట్టుగానే గీతూని ఓ రేంజ్ లో క్లాస్ పీకారు నాగ్. ఇక బిగ్ బాస్ సీజన్6 మొదలై అప్పడే ఆరు రోజులు అయ్యింది. ఈ ఆరు రోజుల్లోనే హౌస్ లో నానా రచ్చ జరిగింది. గొడవలు, గోలలు, ఏడుపులు, అల్లర్లతో నానా హంగామాగా ఉంది. శనివారం రోజు ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చాడు. సింగర్ రేవంత్ గురించి మాట్లాడుతూ.. నువ్ ఎంతో చూసి వచ్చావ్.. ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి.. అంటూ కాస్త చురకలు అంటించాడు నాగార్జున.

అలాగే ఆదిరెడ్డి  రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ చెప్పాడు కింగ్. గ్రౌండ్‌లో ఆటలు ఆడాలి.. ఎంపైర్లు వచ్చి తిరుగుతుంటే ఎలా.? అంటూ నాగ్ సెటైర్లు వేశారు. ఇక గీతూ విషయానికొస్తే.. ఆమె నోటి దురుసు, మాట తీరు, ప్రవర్తన మీద మాట్లాడాడు నాగ్. బాత్రూం విషయంలో నువ్వు చెప్పిన తీరు తప్పు.. పదే పదే ఇంకొకరిని తిక్కదానా? అనడం బాగా లేదు. నువ్ అలా పదే పదే తిక్కల్దానా అని అంటే.. నువ్ తిక్కల్దానివి అని జనాలు అనుకుంటారు అన్నాడు నాగార్జున. దానికి గీతూ మాట్లాడుతూ.. అవును సర్ నాకు కాస్త తిక్క ఉంది అని అంది. అవును నీకు తిక్కుంది కాబట్టి అందరికీ తిక్క ఉందని అనుకుంటున్నావ్.. కానీ నీకు మాత్రమే తిక్క ఉంది.. నువ్ అన్ని మాటలు చెప్పావ్.. కానీ నువ్ వాడిన టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావ్.. మనం చెప్పే మాటలను మనం పాటించాలి.. సంబంధం లేని విషయంలో దూరితే జైల్లో వేస్తారు అని గట్టిగానే చెప్పారు నాగార్జున.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!