Bigg Boss 6: “నావల్ల కాదు నేను వెళ్లిపోతా”.. బిగ్ బాస్ హౌస్‌లో సింగర్ రేవంత్ రచ్చ

|

Sep 09, 2022 | 7:11 AM

బిగ్ బాస్ సీజన్ 6 రచ్చ రచ్చగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ మేట్స్ మధ్య గొడవలు, అల్లర్లు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది బిగ్ బాస్.

Bigg Boss 6: నావల్ల కాదు నేను వెళ్లిపోతా.. బిగ్ బాస్ హౌస్‌లో సింగర్ రేవంత్ రచ్చ
Bigg Boss Telugu 6 Day 4
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) రచ్చ రచ్చగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ మేట్స్ మధ్య గొడవలు, అల్లర్లు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన జంట మెరీనా-రోహిత్ మధ్య గొడవలు ముదురుతున్నాయి. రోజూ ఎదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది ఈ ఇద్దరి మధ్య. అయితే ఈ ఇద్దరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. వీళ్లిద్దరికీ ఒకే నామినేషన్.. ఒకే ఎలిమినేషన్.. జంటగా వచ్చారు కాబట్టి జంటగా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ ఇద్దరు హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే గొడవలు పడటం మొదలు పెట్టారు. ఎదో ఒక కారణంతో గొడవలు పెట్టుకుంటున్నారు ఈ ఇద్దరూ.. మొదటి రోజు నుంచి రోహిత్‌ని కంట్రోల్‌లో పెట్టడానికే ట్రై చేస్తుంది మెరీనా. నాతో మాట్లాడటం లేదు.. ముద్దుపెట్టడం లేదు.. హగ్ ఇవ్వడం లేదు.. అసలు నువ్ నాకు టైం కేటాయించడం లేదు అంటూ గొడవపడుతోంది మెరీనా.

ఇక ఈ భార్య భర్తల మధ్య శ్రీ సత్య ఎంటర్ అయ్యింది. నిన్నటి ఎపిసోడ్ లో రోహిత్ కోసం శ్రీసత్య, మెరీనాలు గొడవపడ్డారు. నేను నా మొగుడుతో మాట్లాడుతుంటే.. సత్య వచ్చి.. రా నడుస్తూ మాట్లాడుకుందాం అంటుంది.. అసలు ఆమె ఎవరు? అని మెరీనా మండిపడింది. ఇంతలో సత్య వచ్చి వాకింగ్ వెళ్దాం అని అనడం కూడా తప్పేనా?’ అని అంటుంది. దానికి మెరీనా నాకు నా భర్తతో టైం కావాలి.. దాన్ని నువ్ ఎలా తీసుకుంటావ్ అని అడగడంతో.. ‘ఓకే.. నీ భర్త నీతో ఉండకపోతే నన్నేం చేయమంటావ్’ అని శ్రీ సత్య అంది. దాంతో హౌస్ లో హౌస్ లో మొగుడు పెళ్ళాల పోరు ఎక్కువైంది. ఇక బిగ్ బాస్ తొలివారం నామినేషన్స్ ముగియడంతో.. కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ మొదలైంది. తొలివారం కెప్టెన్ కావడానికి కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. గలాటా గీతు కెప్టెన్సీ కోసం మరోసారి తన వాయిస్ గట్టిగా వినిపించింది. . ఇక అరోహి అయితే రొట్ట పంచాయితీ అంటూ సింగర్ రేవంత్ ను టార్గెట్ చేసి మాట్లాడింది. దాంతో రేవంత్ కూడా గట్టిగానే స్పందించాడు.  సింగర్ రేవంత్ తొలిరోజు నుంచి టార్గెట్ కావడంతో.. నేను వెళ్లిపోతా బిగ్ బాస్ అంటూ పంచాయితీ మొదలుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.