బిగ్ బాస్(Bigg Boss 6 Telugu)లో ఈ వారం కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎపిక అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శ్రీ సత్య, శ్రీ హాన్, ఆదిరెడ్డి పోటీపడ్డారు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో మూడు ఇసుక తొట్టెలు ఇచ్చి.. డబ్బాలతో ఇసుక తీసుకుని వెళ్లి ఆ తొట్టెలు నింపాలని.. ముందుగా ఎవరి తొట్టె అయితే నిండుతుందో వాళ్లు హౌస్‌కి కెప్టెన్ అవుతారని చెప్పారు. దాంతో శ్రీ సత్య, శ్రీ హాన్, ఆదిరెడ్డిపోటాపోటీగా ఆడారు. అయితే ఈ పోటీలో ఆదిరెడ్డి విజేతగా నిలిచి కెప్టెన్ అయ్యాడు. శ్రీ హాన్ ఆదిరెడ్డితో గట్టిగా పోటీపడ్డాడు. చిన్న గ్యాప్ లో శ్రీహాన్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. ఇక ఆది రెడ్డి హాట్ అడ్వాంటేజ్ అవ్వడంతో ఈ టాస్క్ లో విన్ అయ్యాడు. ఇక కెప్టెన్ అయిన వెంటనే ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి. లవ్యూ కవితా.. నువ్ హ్యాపీనా అంటూ భార్యని తలుచుకున్నాడు.
నన్ను అర్ధం చేసుకుని బిగ్ బాస్ హౌస్‌కి పంపావ్.. ముందు ముందు ఇంకా చాలా ఉంది అంటూ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక వాసంతి క్రిష్ణన్ ఇనయ దగ్గర డిస్కషన్ పెట్టింది. ఈ వారం నేను, నువ్వు , ఆరోహి డేంజర్ జోన్ లో ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అర్జున్ తో మాట్లాడుతూ.. ఫుటేజ్ విషయంలో గీతుకి సపోర్ట్ చేస్తున్నారు కానీ.. అది మంచిదా చెడ్డదా అని ఎవరూ ఆలోచిండం లేదు.. కేవలం ఫుటేజ్ ఇస్తుందనే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కావాలని గొడవలు పెట్టుకుని ఫుటేజ్ క్రియేట్ చేసుకోవడం చాలా సిల్లీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నైట్ ఇనాయ దగ్గర పడుకొని” లాస్ట్ వరకూ ఉన్నామా? మధ్యలో వచ్చేశామా అన్నది కాదు.. బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కవారం ఉండి.. ఆ స్టేజ్ మీదికి వెళ్లినా లక్ అనే చెప్పాలి.. నాగార్జున సార్ చెప్పారు కదా.. కోట్లాది మందిలో మీరు సెలెక్ట్ అయ్యారు అని.. నాకు హౌస్ మేట్స్ ఎవరూ నచ్చలేదు. కంటెంట్ ఇవ్వడానికి హౌస్ మేట్స్ సపోర్ట్ చేయడం లేదు. పిచ్చిదానిలో నేనొక్కదాన్నే మాట్లాడుకుంటే కంటెంట్ ఏమి వెళ్తుంది? నాకు సపోర్ట్ ఇస్తే కంటెంట్ ఇస్తా.. కానీ నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్లు ఎవ్వరూ లేరు అంటూ తెగ ఫీలైపోయింది వాసంతి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి