AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tasty Teja: అప్పుడు ఇరానీ ఛాయ్ రెస్టారెంట్.. ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్ చేసిన టేస్టీ తేజ.. వీడియో ఇదిగో

యూట్యూబర్ గా ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ నెట్టింట మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు టేస్టీ తేజ. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండు సార్లు పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇక బిజినెసుల్లోనూ దూసుకుపోతున్నాడు టేస్టీ తేజ

Tasty Teja: అప్పుడు ఇరానీ ఛాయ్ రెస్టారెంట్.. ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్ చేసిన టేస్టీ తేజ.. వీడియో ఇదిగో
Tasty Teja
Basha Shek
|

Updated on: Apr 24, 2026 | 12:45 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో టేస్టీ తేజ ఒకడు. అంతకు ముందు యూట్యూబ్ గా , ఫుడ్ వ్లాగ్స్ చూస్తూ సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంత చేసుకున్నాడు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి అడుగు పెట్టాడు. ఏకంగా రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోస్ , ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు టేస్టీ తేజ. ముఖ్యంగా ఈ మధ్యన తెలుగులో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే.. టేస్టీ తేజతో కలిసి ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు చాలా మంది హీరోలు. ఈ రకమైన ప్రమోషన్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు తేజ. ఆ మధ్యన బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా నటించిన సుమతీ శతకం సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి సందడి చేశాడు టేస్టీ తేజ.

మొత్తానికి టీవీ ప్రోగ్రామ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీ బిజీగా ఉంటోన్న టేస్టీ తేజ బిజినెసుల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అతను హైదరాబాద్ లో ఇరానీ ఛాయ్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. తాజాగా మరొక బిజినెస్ కూడా ప్రారంభించాడని తెలుస్తుంది. శ్రీ టేస్టీ తేజ సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ , సెలబ్రేషన్స్ బిజినెస్ లోకి తేజ అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. బర్త్ డేలు, పెళ్లి వేడుకలు, వెడ్డింగ్ యానివర్సిడే వంటి ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడం ఫుడ్ క్యాటరింగ్ వంటి కార్యక్రమాలను టేస్టీ తేజ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించి గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ  ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు టేస్టీ తేజ. దీనికి ‘ నా కల నెరవేరింది’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు టేస్టీ తేజకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

పూజా కార్యక్రమాల్లో టేస్టీ తేజ.. వీడియో..

View this post on Instagram

A post shared by Tasty Teja (@tastyteja)

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకే చోట..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us