Bigg Boss Telugu 8: హౌస్‌లో మొదటి నామినేషన్స్.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్స్

|

Sep 03, 2024 | 12:39 PM

తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ మధ్య మరింత రచ్చ జరిగిందని చూపించారు. మూడో రోజే హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ముందుగా హౌస్ లో నిఖిల్ , నైనికా , యష్మీ గౌడ ఇంటి చీఫ్స్‌గా ఎంపికయ్యారు

Bigg Boss Telugu 8: హౌస్‌లో మొదటి నామినేషన్స్.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్స్
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 లో మొత్తం 14మందిని హౌస్ లోకి పంపించారు నాగార్జున . ఇక మొదటి రోజు నుంచి హౌస్ లోకి వెళ్లిన వారు మాటలయుద్దాలు మొదలుపెట్టారు. నిన్నటి ఎపిసోడ్ లో చాలా జరిగాయి. కలిసి ఆడి పాడారు.. ఆతర్వాత గొడవలు కూడా పెట్టుకున్నారు. యష్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్ , అభయ్ నవీన్, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, సోనియా ఆకుల , బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, అఫ్రిదీ హౌస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు నాగ మణికంఠ, ఆదిత్య ఓం మధ్య చిన్న వివాదం రాజుకుంది. ఆదిత్య తనను నామింట్ చేయడం పై మణికంఠ అసహనం వ్యక్తం చేశాడు. అలాగే నిఖిల్ తో మణికంఠ ఓ డిస్కషన్ పెట్టాడు. ఆతర్వాత అరెంజ్స్ తో ఆదుకోవడం పై శేఖర్ భాషకు , సోనియా ఆకుల మధ్య వాగ్వాదం జరిగింది. అడ్డదిడ్డంగా వాదించిన శేఖర్ భాషకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా.

తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ మధ్య మరింత రచ్చ జరిగిందని చూపించారు. మూడో రోజే హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ముందుగా హౌస్ లో నిఖిల్ , నైనికా , యష్మీ గౌడ ఇంటి చీఫ్స్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురిన్సి మూడు హారాలు ఇచ్చి, మూడు కుర్చీలను ఏర్పాటు చేసి అందులో కూర్చోవాలని చెప్పాడు బిగ్ బాస్. ఆతర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు.

ముందుగా సోనియా బెజవాడ బెబక్కను నామినేట్ చేసింది. కిచన్ లో రెస్పాన్సబుల్ గా లేరు అని సోనియా అంది. దానికి బెబక్క ఎదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సోనియాకు హౌస్ చీఫ్స్ కు మధ్య చిన్న వాదన జరిగింది. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేసింది. దానికి మనోడు నాది కుక్కలా మొరిగే నేచర్ కాదు అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు. ఆ తర్వాత శేఖర్ బాషా కూడా మణికంఠను నామినేట్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆతర్వాత ప్రేరణకు సోనియాకు మధ్య కాస్త గట్టిగానే గొడవ జరిగింది. సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. ఈ గొడవలో ప్రేరణ కాస్త పెద్ద పెద్దగా అరుస్తూ రచ్చ చేసింది. చివరిలో యాష్మి ఓ కట్టెతో బెబక్క ఫోటో పై పొడవడం చూపించారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు హౌస్ లో రచ్చ గట్టిగానే జరిగేలా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.