ఆదివారం వస్తే చాలు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక వీకెండ్ వస్తే బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున సందడి చేస్తున్నారు. ఇక నిన్నటి వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం రోజున తేజ ఎలిమినేట్ అయ్యాడు . ఇక ఆదివారం రోజున పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీ నిన్న ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్ లో చివరిగా విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు మిగిలారు. వీరిలో విష్ణుప్రియ సేఫ్ అవ్వడంతో పృథ్వీ అవుట్ అయ్యాడు. ఇక విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యింది.
ఆదివారం రోజున నాగార్జున హౌస్ మేట్స్ తో సరదాగా ఆటలు పాటలతో సందడి చేశారు. ఆతర్వాత ఎలిమినేషన్ లో ఉన్న పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండి అని నాగార్జున పిలిచారు. అక్కడ ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు పెట్టారు. అలాగే రెండు లిక్విడ్ బాటిల్స్ కూడా ఇచ్చారు. నెం 1 అని రాసిన లిక్విడ్ ని ఇద్దరూ తమ ముందు ఉన్నఅక్వేరియంలో వేయాలని చెప్పారు నాగ్. దాంతో ఆ వాటర్ ఎల్లో కలర్ లోకి మారిపోయాయి.
ఇద్దరి అక్వేరియంలు ఎల్లో కలర్ లోకి మారిన తర్వాత మరో బాటిల్ అంటే నెం 2 అని రాసిన లిక్విడ్ ను అక్వేరియం వేయాలని ఎవరి అక్వేరియంలో వాటర్ రెడ్ కలర్ లో మారితే వారు ఎలిమినేట్ అని చెప్పారు నాగ్. దాంతో ఇద్దరు ఆ లిక్విడ్ పోయగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉండిపోయాయి. దాంతో పృథ్వీ ఎలిమినేట్ అంటూ ప్రకటించారు నాగార్జున. ఇక విష్ణు ప్రియా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకుంది. నాకు ఓటేసిన వాళ్లకి థాంక్యూ నన్ను నన్నుగా ప్రేమించారు.. థాంక్యూ అని విష్ణు చెప్పుకుంది. అందరికీ హగ్గు ఇచ్చి బైబై చెప్పాడు పృథ్వీ. విష్ణు మనోడికి ఓ హగ్ తో పాటు బుగ్గమీద ముద్దు కూడా ఇచ్చింది. పృథ్వీ జర్నీ వీడియో ప్లే చేశారు నాగార్జున. ఆ జర్నీలో తన తండ్రి ఫొటో గురించి వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యాడు. అలాగే ఫ్యామిలీ వీక్ లో వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పటి సీన్స్ చూసి పృథ్వీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..