Bigg Boss Telugu 8: ఓరి మీదుంపలు తెగ..! అప్పుడే మొదలెట్టేశారుగా.. శేఖర్ బాషాకు ఇచ్చిపడేసిన సోనియా

|

Sep 02, 2024 | 12:59 PM

ఇక తాజాగా రెండో రోజుకు సబంధించిన ప్రోమోను ను విడుదల చేశారు. వీరిలో నాగ మణికంఠ  కాస్త బెటర్ అని ప్రేక్షకులకు అనిపించింది. ఇంతలో అతన్ని బయటకు పంపే ప్రయత్నం జరిగింది. ఆదిత్య ఓంతో పాటు.. నైనిక, బేబక్క, విష్ణు ప్రియ, సోనియా మణికంఠను బయటకు పంపేందుకు ఓట్లు వేయడంతో అతను ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss Telugu 8: ఓరి మీదుంపలు తెగ..! అప్పుడే మొదలెట్టేశారుగా.. శేఖర్ బాషాకు ఇచ్చిపడేసిన సోనియా
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. అందరూ ఊహించినట్టే కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అలాగే ఇంకొంతమంది ఊహించని కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం రోజున కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేసు హౌస్ లోకి పంపించారు. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి పంపించారు నాగార్జున. యష్మీ గౌడ (సీరియల్ నటి), నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు), అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్), ప్రేరణ కంభం (సీరియల్ నటి), ఆదిత్య ఓం (నటుడు), సోనియా ఆకుల (నటి), బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్),
శేఖర్ బాషా (ఆర్జే), కిర్రాక్ సీత (యూట్యూబర్), నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్), పృథ్వీరాజ్ ( సీరియల్ నటుడు), విష్ణు ప్రియ (యాంకర్), నైనిక (ఢీ డ్యాన్సర్), అఫ్రిదీ (యూట్యూబర్) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక తాజాగా రెండో రోజుకు సబంధించిన ప్రోమోను ను విడుదల చేశారు. వీరిలో నాగ మణికంఠ  కాస్త బెటర్ అని ప్రేక్షకులకు అనిపించింది. ఇంతలో అతన్ని బయటకు పంపే ప్రయత్నం జరిగింది. ఆదిత్య ఓంతో పాటు.. నైనిక, బేబక్క, విష్ణు ప్రియ, సోనియా మణికంఠను బయటకు పంపేందుకు ఓట్లు వేయడంతో అతను ఎమోషనల్ అయ్యాడు.

ఆతర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఆతర్వాత మొదలైంది అసలైన రచ్చ. హౌస్ మేట్స్ లో కొందరు ఆరెంజ్‌లతో ఆటలాడుకున్నారు. దాంతో సోనియా అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ బాషా రెచ్చిపోయాడు. తినే వాటితో ఆటలొద్దు అని సోనియా చెప్తుంటే శేఖర్ బాషా మాత్రం కాస్త రెచ్చిపోయాడు. బిగ్ బాస్ రూల్స్‌లో ఆరెంజ్‌లతో ఆడకూడదని రాశారా?లేదు అంటూ లాజిక్స్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాంతో సోనియా కూడా ఎక్కడ తగ్గకుండా గట్టిగానే ఇచ్చేసింది. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో.. కిందేసి తొక్కుకో డ్రైనేజ్‌లో వేసుకో.. టేబుల్ మీద పెట్టుకో.. కానీ దాన్ని మాత్రం వేరే వాళ్లకి ఇవ్వకు.. మనుషుల్లా తినాలనుకునే వాళ్లకి అవి పెట్టకు అని కౌంటర్ ఇచ్చింది. దాంతో అదే ఆరెంజ్ ను తింటూ.. ఆడిన వాటితోనే తిన్నా.. ఇప్పుడు నేను మనిషిని కాదా? అని శేఖర్ బాషా అడ్డదిడ్డంగా వాదించాడు. ఆతర్వాత హౌస్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచిన దాన్ని బట్టి రేషన్ వివాదం జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.