Bigg Boss 7 Telugu: పాపం అమర్.. కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించని శివాజీ

|

Nov 24, 2023 | 4:39 PM

హౌస్ మేట్స్ తమ నిర్ణయం చెప్పగానే ఆ ఫోటో కాలిపోతుందని చెప్పాడు బిగ్ బాస్. ఎం,ముందుగా విడుదల చేసిన ప్రోమోలో ప్రియాంక , గౌతమ్ కలిసి అర్జున్ ను సేవ్ చేశారు. ఈ క్రమంలో గౌతమ్ శోభా కంటే అర్జున్ ఆట బెటర్ అన్నాడు. దాంతో చిన్న వాదన జరిగింది. ఆ తర్వాత శోభా, ప్రశాంత్ కలిసి అమర్ ను సేవ్ చేశారు. అశ్విని ఫోటోను కాల్చేశారు.

Bigg Boss 7 Telugu: పాపం అమర్.. కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించని శివాజీ
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇందుకోసం హౌస్ లో ఉన్న వారికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఓ మిషన్ గన్ ను ఉంచి దానికి ఎదురుగా ఉన్న గోడపై ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ ఫోటోలను ఉంచి ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో వారి ఫోటోను గన్ తో షూట్ చేయాలనీ చెప్పాడు. హౌస్ మేట్స్ తమ నిర్ణయం చెప్పగానే ఆ ఫోటో కాలిపోతుందని చెప్పాడు బిగ్ బాస్. ఎం,ముందుగా విడుదల చేసిన ప్రోమోలో ప్రియాంక , గౌతమ్ కలిసి అర్జున్ ను సేవ్ చేశారు. ఈ క్రమంలో గౌతమ్ శోభా కంటే అర్జున్ ఆట బెటర్ అన్నాడు. దాంతో చిన్న వాదన జరిగింది. ఆ తర్వాత శోభా, ప్రశాంత్ కలిసి అమర్ ను సేవ్ చేశారు. అశ్విని ఫోటోను కాల్చేశారు. ఆ తర్వాత రతికా, యావర్ కలిసి శివాజీని సేవ్ చేసి ప్రశాంత్ ఫోటోను కాల్చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్ రతికా మధ్య వాదన జరిగింది.

తాజాగా సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ముందుగా శోభా అశ్వినితో మాట్లాడుతూ.. అక్కడ అమర్ ఫోటో కాకుండా ఎవ్వరి ఫోటో ఉన్నా నేను నీకే సపోర్ట్ చేసే దాన్ని అని అశ్వినితో చెప్పింది శోభా. ఎవ్వరితో వచ్చినా నేను నీకోసం నిలబడతా అని రతికాకు చెప్పింది శోభా. ఆతర్వాత శివాజీ యావర్ తో మాట్లాడుతూ.. అమర్ అర్జున్ వస్తే నాకు టెన్షన్. అర్జున్ భార్య ప్రగ్నెంట్ కదా..  అర్జున్ ఇంకోసారి కెప్టెన్ కావాలి తను నన్ను అడిగింది అని చెప్పాడు.

ఇక టాస్క్ మొదలవగానే అర్జున్, అమర్ ఫోటోలు వచ్చాయి. దాంతో శోభా, శివాజీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శోభా మాట్లాడుతూ ఇంట్లో నుంచి వెళ్ళేలోగా నీకు ఏదైతే అవసరం ఉందో అది చేస్తాను అని చెప్పను అని అంది. ఆతర్వాత అర్జున్ మాట్లాడుతూ ఒక్కసారి కెప్టెన్ అయ్యాను అనేది కాకుండా నేను ఎందులో తక్కువ అని శోభను అడిగాడు. దానికి శోభా మాట్లాడుతూ.. నువ్వెంత కేపబులో అమర్ కూడా అంతే కేపబుల్ అని చెప్పింది. ఆతర్వాత శివాజీ అర్జున్ కు ఫెవర్ గా మాట్లాడటంతో అమర్ శివాజీని బ్రతిమిలాడుకున్నాడు. అన్న అర్ధం చేసుకో అన్న అని చెప్పినా కూడా శివాజీ వినలేదు. అవకాశం వచ్చింది పోగొట్టకు అన్న నీకు దండం పెడతా అని వేడుకున్నా కూడా శివాజీ కనికరించలేదు. మా అమ్మ ,నాన్న కూడా ఆశపెట్టుకున్నారు అన్న అని అమర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరొద్దన్నారు రా..? నువ్ ఏడుస్తున్నావ్ ఎందుకురా.. అంటూ శివాజీ  రెచ్చిపోయాడు. రేపు టికెట్టు ఫినాలే ఉంది అది గెలువు అని అన్నాడు. దానికి అమర్ అన్న కెప్టెన్ అవ్వడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్న నేను కెప్టెన్ అవ్వాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకో అవకాశం లేదన్న అని అమర్ ఏడ్చినా కూడా శివాజీ ఉపయోగం లేదు అంటూ అమర్ ఫోటోను కాల్చేశారు. ఆతర్వాత అమర్ ఎందుకురా ఏడుస్తున్నావ్.. కెప్టెన్ అయితేనే కప్పు కొడతావా ఏంటి అంటూ దైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అమర్ నేను దేనికి పనికి రాను, నేను ఏ గేమ్ ఆడలేదు.. నా కన్నా కండలుండి, బాడీ ఉంటే వాళ్ళు గొప్ప అంటూ బాధను వ్యక్తం చేశాడు. కానీ అమర్ వాష్ రూమ్ కు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.