Bhagavanth Kesari OTT: ఓటీటీలోకి అడుగుపెట్టిన భగవంత్‌ కేసరి.. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

దసరా కానుకగా అక్టోబర్‌ 19న థియేటర్లలోవిడుదలైన భగవంత్‌ కేసరి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ.135 కోట్ల వసూళ్ల రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన భగవంత్ కేసరి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Bhagavanth Kesari OTT: ఓటీటీలోకి అడుగుపెట్టిన భగవంత్‌ కేసరి.. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Bhagavanth Kesari
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2023 | 3:49 PM

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావి పూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ పక్కా కమర్షియల్‌ మూవీలో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా అక్టోబర్‌ 19న థియేటర్లలోవిడుదలైన భగవంత్‌ కేసరి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ.135 కోట్ల వసూళ్ల రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన భగవంత్ కేసరి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బాలయ్య సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మొదట నవంబర్‌ 23 లేదా నవంబర్‌ 25 నుంచి బాలయ్య సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం (నవంబర్‌ 24) అర్ధరాత్రి నుంచే భగవంత్‌ కేసరిని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో బాలయ్య మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా భగవంత్ కేసరి సినిమాను నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ బాలయ్య మూవీలో స్టైలిష్‌ విలన్‌గా మెప్పించాడు. అలాగే శరత్ కుమార్‌, రవి శంకర్‌, రఘు బాబు, శుభలేక సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందించారు. మరి థియేటర్లలో భగవంత్‌ కేసరి సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా అమెజాన్‌ ప్రైమ్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య, శ్రీలీల

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

ఆ భాషల్లోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే