Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. గత నాలుగు సీజన్స్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త రసవత్తరంగా సాగుతుంది. పైకి నవ్వుతు కనిపిస్తున్నా ఎవరిగేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇంటిసభ్యుల మధ్య విచిత్రమైన టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. మొదటి వారం సరయు, రెండోవారం ఉమాదేవి, అలాగే రీసెంట్‌గా లహరి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో సన్నీ యాంకర్ గా చేస్తే శ్రీరామ్ చంద్ర గెస్ట్ గా చేశారు. ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సాగింది. ముందుగా ప్రియా మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని శ్రీరామ్ ను ప్రశ్నించగా.. నేను సిరీకి కూడా చెప్పా నేను కమిట్ అవ్వకుండా ఉంటే నీకే ట్రై చేసేవాడిని అని సమాధానం ఇచ్చాడు. వెంటనే రవి దూరి అన్నా నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదు అని నవ్వులు పూయించాడు. ఒక్క అమ్మాయిని డేట్ కు తీసుకువెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తారు.. అని శ్వేతా వర్మ ప్రశ్నించగా..దానికి తెగ సిగ్గుపడ్డాడు శ్రీరామ్. ఆతర్వాత ఓ అందమైన పాటకు హమీదాతో డాన్స్ వేసాడు. అలాగే హమీదా సిరి అంటూ కాజల్ ప్రశ్నించగా.. లంచ్ టీమ్ కు సిరి.. డిన్నర్ కు హమీద అని చెప్పాడు శ్రీరామ్ .. మరి టిఫిన్స్ ఎవరితో సార్ అని సన్నీ అడగ్గానే .. రవి సూపర్ యాంకరింగ్ సార్ అని అంటాడు. ఆతర్వాత సన్నీ హౌస్ లోని ఒక్కకరిలా నటించి చూపించాడు. ఆతర్వాత ఫన్నీ గా చేశా సీరియస్ గా తీసుకోవద్దు సిరి అనగానే… సోమవారం చూసుకుందాం అంటుంది సిరి..
మరిన్ని ఇక్కడ చదవండి :