Bigg Boss 5 telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరిదశకు వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో సీజన్ 5 ముగియనుంది. దాంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో 5 గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. సిరి , షణ్ముఖ్, సన్నీ , మానస్ , శ్రీరామ్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది మరి కొద్దిరోజుల్లో తెలియనుంది. ఇక టాస్క్‌లు.. కెప్టెన్‌లు.. లగ్జరీ బడ్జెట్ లాంటివి అన్ని పూర్తయిపోయాయి . ఈ వారం రోజులు హౌస్ లో ఉన్న వారికీ హైప్ ఇచ్చే పనిలో ఉన్నాడు బిగ్ బాస్. ఇక సోమవారంతో 100 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఈ ఎపిసోడ్ లో..
ముందుగా సన్నీ , మానస్ టైటిల్ గురించి మాట్లాడుకున్నారు. ఏమౌతుందో అని టెన్షన్‌గా ఉంది.. టైటిల్ ఎలాగైనా గెలివాలి.. మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్.. ఏదైనా చేయనియ్.. బరాబర్ ఇస్తా’ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు సన్నీ. మానస్ ఏం కాదురా అంటూ దైర్యం చెప్పాడు. అలాగే షణ్ముఖ్ సిరీ మాట్లాడుకుంటూ కనిపించారు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. ‘అందరికీ క్లియర్ చేసుకోవాల్సింది ఏంంటంటే.. నీకు దెబ్బతగిలిన తరువాత నేను మిగతావాళ్ళని ఎవర్నీ పట్టించుకోవడం లేదు.. నేను నిన్నే పట్టించుకుంటున్నాను.. అది అలాగే కంటిన్యూ అయిపోయింది..సరే ఏది జరిగినా మన మంచికే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఫైనల్‌కి చేరిన ఒక్కో కంటెస్టెంట్ జర్నీని కళ్లకి కడుతూ బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మొదటిగా ఫైనల్‌కి చేరిన తొలి ఫైనలిస్ట్ శ్రీరామ్‌ని సర్ ప్రైజ్ చేశారు. ముందుగా ఫస్ట్ ఫైనలిస్ట్ శ్రీరామచంద్ర జర్నీ చూపించాడు బిగ్ బాస్. దాంతో శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :