
ఎవరూ ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో దిగ్విజయంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం కూడా వీకెండ్ కి చేరుకుంది. మరి ఈ వీకెండ్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో కంటెస్టెంట్లలో దడ మొదలైంది. ఈ వారం నామినేషన్లలో రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ, యాంకర్ వర్షిణి,సుధీర్ ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటుండటంతో ఈ వారం ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీరిలో యాంకర్ వర్షిణీ ఈ వారం కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిందని సమాచారం. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఆమె నుంచి పెద్దగా పెర్ఫామెన్స్ లేదు. టాస్కులు కూడా పెద్దగా ఆడడం లేదు. అయినా ప్రతి వారం ఈ యాంకరమ్మను బిగ్ బాస్ సేఫ్ చేస్తున్నాడు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నప్పటికీ వర్షిణీ ఎలిమినేషన్ నుంచి దాదాపు బయటపడిందనే తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ‘ది అల్టిమేట్ గోట్’ థీమ్ లో భాగంగా హౌస్‌లో బీబీ హోటల్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లను రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా విభజించి వారికి వేర్వేరు బాధ్యతలు అప్పగించారు. రెడ్, ఎల్లో జోన్లలో ఉన్న వారు గ్రీన్ జోన్ లోకి వస్తే నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన స్నేక్స్ అండ్ ల్యాడర్స్ టాస్కులో వర్షిణీ, రామ్ ప్రసాద్ సత్తా చాటారు. టాప్ స్టార్స్ తో ఇద్దరూ ఎల్లో లెవెల్ నుంచి నేరుగా గ్రీన్ జోన్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి వీరిద్దరూ దాదాపు సేవ్ అయినట్టేనని సమాచారం. ఇక వీరిద్దరూ కాకుండా ఈ వారం రోహిత్, వంశీ, దేబ్జాని, శివ, సుధీర్ , ఝాన్సీ నామినేషన్ లో ఉన్నారు. రోహిత్, వంశీ, దేబ్ జానీకి ఓట్లు భారీగా పడుతున్నాయి. టాస్కులు కూడా బాగా ఆడుతున్నారు. కాబట్టి వీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రస్తుతం సుధీర్, శివ్, ఝాన్సీ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలుసుకోవాలంటే ఆదివారం ఎపిసోడ్ దాకా వేచి ఉండాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.