బిగ్ బాస్ గేమ్ చొ పై ఇప్పటికే చాలా మంది విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ప్రేక్షకులను సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కొందరు. ప్రజలను చెడగొడుతుందని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే బిగ్ బాస్ మీద కేసు కూడా పెట్టారు. ఇక బిగ్ బాస్ షో చాలా భాషల్లో టెలీకాస్ట్ అవుతుంది. మన దగ్గర ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే సీజన్ 8తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హిందీలోనూ ఈ గేమ్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. టీవీ షోతో పాటు ఓటీటీ సీజన్స్ తోనూ బిగ్ బాస్ ఆకట్టుకుంటుంది. ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు అనిల్ కపూర్ హోస్ట్ గా చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ అంటే మనకు గుర్తొచ్చేది గొడవలు, గోలలు, ఏడుపులు, అరుపులు, సింపథీ ఆతర్వాత టాస్క్ లు, ఎలిమినేషన్, ఓటింగ్ ఇలా చాలా ఉంటాయి. ఈ మధ్య బిగ్ బాస్ షోలు కాస్త మితిమీరుతున్నాయి. హాట్ హాట్ బ్యూటీస్ ను హౌస్ లోకి పంపి టీఆర్పీ పెంచుకుంటున్నారు. హిందీలో ఇది మనం ఎక్కువగా చూస్తుంటాం.. అందాల ముద్దుగుమ్మలు హౌస్ లోకి పంపించి షోకు గ్లామర్ టచ్ ఇస్తుంటారు.
అలాగే హౌస్ లోకి కపుల్ ను కూడా పంపిస్తుంటారు. రీసెంట్ గా హిందీలో ఒక వ్యక్తి అతని ఇద్దరి భార్యలను హౌస్ లోకి పంపించారు. అర్మాన్ మాలిక్ అనే సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ అతని ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. దాంతో చాలా మంది దీని పై విమర్శలు గుప్పించారు.అర్మాన్ మాలిక్ భార్యల పేర్లు పాయల్ మాలిక్, క్రితికా మాలిక్.ఇదిలా ఉంటే ఈ మధ్యనే పాయల్ మాలిక్ ఎలిమినేట్ అయ్యింది. తాజాగా మరోసారి అతని పై అలాగే బిగ్ బాస్ యాజమాన్యం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ ఎక్కువైంది. తాజాగా అర్మాన్ మాలిక్ తన భార్యతో బెడ్ పై రొమాన్స్ చేయడం పెద్ద దుమారం రేపుతోంది. భార్యతో అతను రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీని పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బిగ్ బాస్ షో మరీ ఇంత దిగజారిందేంటి అంటూ ఫైర్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.