బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ ఉమెన్ కంటెస్టెంట్ ఎవరు అంటూ టక్కున చెప్పే పేరు ఇనాయ సుల్తానా. ఇటీవలే చివరి కెప్టెన్ అయ్యి సెమీఫైనల్ కు సెలక్ట్ అయ్యింది ఇనాయ. హౌస్ లో ఎంత పోటీ ఉన్న దైర్యంగా ఎదుర్కొంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఇనాయ. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ కు వెళ్ళాక ముందు ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన లైఫ్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. అలాగే తన పైన వస్తున్న నెగిటివిటి గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇనాయ పలు ఇంటర్వ్యూల్లో యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ అమ్మడు అర్జీవిని ఇంటర్వ్యూ చేయడం.. ఆ తర్వాత ఆయనతో కలిసి బర్త్ డే పార్టీలో డాన్స్ చేయడంతో బాగా పాపులర్ అయ్యింది. ఈ వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. నిజానికి ఇనాయ కు బిగ్ బాస్ రావడానికి కూడా ఒకవిధంగా కారణం అయ్యింది.
ఆర్జేవీతో ఇనయాకి ఏదో రిలేషన్ ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆ డాన్స్ వీడియో గురించి మాట్లాడుతూ..ఆర్జీవీగారంటే నాకు చాలా ఇష్టం.. ఆయన గ్రేట్ డైరెక్టర్ అనే రెస్పెక్ట్ ఉంది. సెకండ్ లాక్ డౌన్‌లో ఒక షూట్‌లో ఆయన్ని కలిశాను. ఆ తరువాత రెండు మూడు సందర్బాల్లో ఆయన్ని కలిశాను. ఇంతలో నా బర్త్ డే వచ్చింది. నా బర్త్ డే కు సార్ వచ్చారు.. కేక్ కట్ చేశాం.. సాంగ్స్ ప్లే చేశారు.. ఇద్దరం డాన్స్ చేశాం.. ఆ వీడియో వైరల్ అయిపోయింది. నా లైఫ్‌లో నా బర్త్ డే అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నది అదే. దానికి ఆర్జీవీ సార్ వచ్చారు అని తెలిపింది. ఆ వీడియో ఎవరు తీశారు..? ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు.
ఆ వీడియో లీక్ అయినా తర్వాత మా ఇంట్లో వాళ్ళు నన్ను ద్వేషించారు. చాలా మంది నన్ను తప్పుగా చూస్తున్నారు. కానీ నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇండస్ట్రీకి రావడానికి ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటే నేను వేరేలేవేల్ లో ఉండేదాన్ని.. నా పేరెంట్స్ సపోర్ట్‌తో నేను ఇండస్ట్రీలోకి రాలేదు.. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. రెండేళ్లుగా నేను ఒంటరిగా ఉంటున్నా.. తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేను అని చెప్పుకొచ్చింది.