ప్రముఖ నటుడు, బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మంద తండ్రి సుందరయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తెలుగులో పలు సీరియల్స్‌లో నటించిన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని నటుడు కౌశల్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. ఆస్పత్రిలో తండ్రికి సేవలు చేస్తోన్న ఒక వీడియోను షేర్ చేసిన బిగ్‌బాస్ విన్నర్ ‘మీ అందరి ప్రార్థనల్లో నాన్నను ఉంచుతున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘మీ అమ్మానాన్నలు మీతో ఎలా ప్రవర్తించారో అంతకంటే మెరుగ్గా ట్రీట్ చేయండి. ఇతరుల కంటే వారినే బాగా చూసుకోండి. మీ ప్రార్థనలలో మా నాన్నని ఉంచుతున్నాను. మీ దీవెనలతో ఆయన త్వరగా కోలుకుంటాడని, మరింత స్ట్రాంగ్‌గా ఆస్పత్రి నుంచి బయటకు వస్తారనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు’ అంటూ తండ్రిపై తనకున్నప్రేమకు అక్షర రూపమిచ్చాడు కౌశల్. అయితే తండ్రి ఏ కారణంతో ఆస్పత్రిలో చేరారో ఈ వీడియోలో తెలపలేదు బిగ్‌బాస్ కౌశల్.
కాగా కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టంట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు స్పందిస్తున్నారు. సుందరయ్య త్వరగా కోలుకోవాలంటూ, కౌశల్ మరింత ధైర్యంగా ఉండాలంటూ ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించాడు కౌశల్. హీరో ఫ్రెండ్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్‌లో సందడి చేశాడు. తమ్ముడు, రాజకుమారుడు, మనసంతా నువ్వే, బద్రి, శివరామరాజు, నీ స్నేహం, నేనున్నాను, వెంకీ, రాజకుమారుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, దరువు, నేను నా రాక్షసి వంటి హిట్ సినిమాల్లో నటించాడు కౌశల్. అలాగే కొన్ని సీరియల్స్, టీవీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. అయితే వీటన్నిటికంటే బిగ్‌బాస్ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన ఆటతీరుతో సీజన్ 2లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం యాడ్‌ఫిల్మ్స్‌లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..